జాతీయ వార్తలు

కారుకు దారివ్వలేదని కత్తితో పొడిచిన ఎమ్మెల్యే కుమారుడు !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: ఓవర్‌టేక్ చేసేందుకు తన కారుకు దారివ్వలేదని ఓ యువకుడిపై ఆర్‌జెడి ఎమ్మెల్యే బీరేంద్ర సిన్హా కుమారుడు కునాల్ కత్తితో దాడి చేయడం సంచలనం కలిగించింది. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో శుక్రవారం రాత్రి కునాల్ కారులో వెళుతూ మరో కారును ఓవర్‌టేక్ చేసేందుకు యత్నించాడు. అయితే, ఆ కారులో వెళుతున్న యువకుడు దారివ్వకపోవడం కునాల్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో కారులో నుంచి దిగి, ఆ యువకుడిపై కునాల్ కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలకు లోనైన యువకుడిని పాట్నా ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కాగా, తన రాజకీయ ప్రత్యర్థులు ఉద్దేశ పూర్వకంగానే కునాల్‌పై ఆరోపణలు చేస్తున్నారని, యువకుడిపై తన కుమారుడు దాడి చేయలేదని ఎమ్మెల్యే బీరేంద్ర చెబుతున్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపి కునాల్‌పై కేసు నమోదు చేయాలని విపక్ష పార్టీల వారు డిమాండ్ చేస్తున్నారు.