జాతీయ వార్తలు

ముంబయి హజీ అలీ దర్గాలోకి మహిళలకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయిలోని హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ బాంబే హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. మహిళలు కూడా దర్గాలోనికి వెళ్లొచ్చని, రక్షణ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల శనిసింగనాపూర్‌, త్రయంబకేశ్వర్‌ ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని కోరుతూ భూమాతా బ్రిగేడ్‌ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్‌ పెద్దఎత్తున ఆందోళన చేపట్టి విజయంసాధించిన నేపథ్యంలో.. దర్గాలోనికి కూడా మహిళలను అనుమతించాలంటూ ఉద్యమం చేపట్టారు.
దర్గాలోకి మహిళలు రాకూడదంటూ హజీ అలీ దర్గా ట్రస్ట్‌ 2012లో నిషేధం విధించింది. మహిళల ప్రవేశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దర్గా ట్రస్ట్‌ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. హైకోర్టు తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేశారు.