క్రీడాభూమి

దీపా కర్మాకర్‌, జితూరాయ్‌లకు ఖేల్‌రత్న?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారతీయుల హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్‌ దీపా 23ఏళ్ల దీపా కర్మాకర్‌ను ఖేల్‌రత్న పురస్కారానికి ప్రతిపాదించినట్లు సమాచారం. ఓ భారత జిమ్నాస్ట్‌ ఒలింపిక్స్‌లో పోటీ పడటమే గొప్ప అనుకుంటే దీప ఏకంగా ఫైనల్‌ చేరి అంచనాలను మించి ఆకట్టుకుంది. ఫైనల్‌లో ఇతర జిమ్నాస్ట్‌లకు గట్టి పోటీనిచ్చి తృటిలో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందిస్తారని తెలుస్తోంది. దీప కోచ్‌ బిశ్వేశ్వర్‌కు ద్రోణాచార్య ఇవ్వాలని కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. రియోలో 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఎనిమిదో స్థానంలో నిలిచిన షూటర్‌ జితూరాయ్‌కు కూడా ఖేల్‌రత్న ఇవ్వనున్నట్లు సమాచారం.