జాతీయ వార్తలు

దిల్లీలో నీటి కటకట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లీ:జాట్‌ల ఆందోళన ఫలితంగా దేశ రాజధాని దిల్లీలో నీటి కటకట ఏర్పడింది. హర్యానానుంచి వచ్చే నీటిసరఫరా వ్యవస్థను ఆందోళనకారులు నిన్న ధ్వంసం చేయడంతో ఇవాళ దిల్లీలో మంచినీటి కొరత తీవ్రరూపం దాల్చింది. కాగా ఈ పరిస్థితుల్లో దిల్లీలో సోమవారం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. వీలైనంతగా నీటిని పొదుపు చేయాలని ప్రజలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. నీటి సరఫరా మెరుగుకోసం కేంద్రంతోనూ చర్చిస్తున్నారు. మరోవైపు దిల్లీకి నీటి సరఫరా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై హర్యానా ప్రభుత్వంతో కేంద్రం చర్చిస్తోంది.