జాతీయ వార్తలు

దేశ రాజధానిలో దట్టమైన దుమ్ము పొర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. దట్టమైన దుమ్ము పొరలు అలుముకోవడంతో ఛండీగర్‌ విమానాశ్రయంలో అన్ని విమానాలను నిలిపివేశారు. మితిమీరిన కాలుష్యంతో ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని వాతావరణంలో ప్రమాదకర రీతిలో పీఎం (నలుసు పదార్థం) స్థాయులు ఉన్నాయనీ, ఇటువంటి గాలిని పీల్చితే శ్వాసకోస వ్యాధుల బారిన పడే అవకాశం ఉందనీ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరించింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దనీ ప్రజలకు సూచించింది. దుమ్ము, ధూళితో ఉక్కిరి బిక్కిరవుతున్న రాజధాని ప్రజలు 33 నుంచి 42 డిగ్రీల ఎండవేడితో చెమటలు కక్కుతున్నారు. కాగా, అక్కడ సాధారణం కన్నా 5 శాతం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.