క్రీడాభూమి

ఫామ్‌లోకి ధావన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ అతను సున్నాకే అవుటయ్యాడు. పేసర్ వెర్నన్ ఫిలాండర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. బెంగళూరులో జరగాల్సిన రెండో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట మాత్రమే సాధ్యమైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 80 పరుగులు చేసింది. ధావన్ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని, దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటాడని అభిమానులు ధీమాతో ఉన్నారు. పైగా, మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ తనను అవుట్ చేసిన ఫిలాండర్ గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడం ధావన్ ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది. ప్రపంచ నంబర్ వన్ బౌలర్ డేల్ స్టెయిన్ గతంలో మాదిరి నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను కష్టపెట్టడం లేదు. ఈ అంశాలన్నీ ధావన్‌కు అనుకూలించడం ఖాయం.