ఖమ్మం

జిల్లా ప్రజలకు తెరాస స్పష్టత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెదేపా నేతల డిమాండ్
* ఫిరాయింపుదారులతో కలిసి పోటీ చేసినా అనర్హతే
భద్రాచలం, నవంబర్ 27: ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా పోటీకి దిగుతుందో ముందుగా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ ఎంపి నామ నాగేశ్వరరావుతో సహా పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నామతోపాటు పోట్ల నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, తుళ్లూరి బ్రహ్మయ్య, కొమరం ఫణీశ్వరమ్మ, కోలేటి భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థిని కనీసం 10 మంది ఎంపీటీసీలు బలపర్చాల్సి ఉందన్నారు. తెరాస గెలిచింది కేవలం ఒక ఎంపీటీసీ, ఒక కౌన్సిలర్ అయినప్పుడు ఆ పార్టీ ఎలా నామినేషన్ వేస్తుందని ప్రశ్నించారు. గెలిచిన గుర్తుపైనే ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తారని, అలాకాకుండా ఫిరాయింపుదారులతో కలిసి నామినేషన్ వేసినా అనర్హత కిందకే వస్తుందని చట్టం చెబుతుందని వారు పేర్కొన్నారు. మహానాయకులు, సత్యహరిశ్చంద్రులు ఉన్న తెరాసలో ప్రజలకు ఏ విధంగా సమాధానం చెబుతారో? చూస్తున్నామని అన్నారు. వాస్తవాలు చెప్పి పునీతులు కావాలని హితవు పలికారు. జిల్లాలో తెరాసను ఓడించేందుకు అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. జిల్లాలో ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపికే పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధుల మనోభావాలు దెబ్బతీసేందుకు తెరాస మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. గతంలో చేరిన వారినే మళ్లీ చూపించి కొత్తగా పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వెళ్లిన నేతలంతా ఆత్మపరిశీలన చేసుకుని, ఆత్మప్రబోధానుసారం తిరిగి రావాలని అన్నారు. అక్కడ తెరాసలో నాయకులకు ఉన్న విలువ ఏ పాటిదో ఇప్పటికే అర్ధమై ఉంటుందని అన్నారు. తెరాసను ఓడించే శక్తి ఒక్క తెలుగుదేశానికే ఉందని వెల్లడించారు. అప్రజాస్వామికంగా, అహంకార పూరితంగా తెరాస పోతుందని విమర్శించారు. అందుకే ఆ పార్టీకి బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎన్నికల సంఘం వద్ద ఏ పార్టీ ఎన్ని గెలుచుకుందో గణాంకాలు ఉన్నాయని ఆత్మగౌరవం కోసం గెలిచిన ప్రజాప్రతినిధులందరూ తమ పార్టీ గుర్తుకే ఓటేయ్యాలని అన్నారు. దొడ్డిదారిన వస్తున్న తెరాసకు బుద్ధి చెప్పి జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తెస్తామని వారు అన్నారు. ఈ సమావేశంలో కొడాలి శ్రీనివాసన్, అజీం, మల్లా ప్రతాప్, కోనేరు రాము, వట్టికొండ రాము తదితరులు పాల్గొన్నారు.
తెదేపాలోనే పంచాక్షరయ్య
సీనియర్ తెలుగుదేశం నేత తాళ్లూరి పంచాక్షరయ్య తెలుగుదేశంలోనే ఉన్నారని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నారన్న వార్తలను నేతలు ఖండించారు. ఆయన బూర్గంపాడు మండలంలో ఎత్తిపోతల పథకం గురించి జిల్లా మంత్రిని కలిశారని, పార్టీ మారలేదని వివరణ ఇచ్చారు.