జాతీయ వార్తలు

కామంధుల బారి నుంచి బాలికను కాపాడిన శునకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగర్: మధ్యప్రదేశ్‌లోని కరీలా ప్రాంతంలో చిన్నారిపై కామందులు అత్యాచారానికి పాల్పడగా.. పెంపుడు శునకం వారిపై పడి కరిచి ఆ బాలికను కాపాడింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కరీలా గ్రామానికి చెందిన బాలిక రాత్రివేళ ఒంటరిగా ఇంటి నుంచి రావటాన్ని గమనించిన ఇద్దరు యువకులు కత్తితో బెదిరించి సమీపంలోని నిర్మానుష్యప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడగా ఆ బాలిక ఇంటి పెంపుడు కుక్క ఇది గమనించి ఆ యువకులపై దాడికి పాల్పడింది. కత్తి దెబ్బలు తిన్నా వారిని విడిచిపెట్టకుండా అరుస్తూ కరిచింది. కుక్క అరుపులకు చుట్టుపక్కలవారు రావటంతో ఆ యువకులు పారిపోయారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకులను అరెస్టు చేశారు.