జాతీయ వార్తలు

రాళ్లు రువ్విన ఘటనలో డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: కశ్మీర్ లోయలో సరుకులు తీసుకు వెళుతున్న ఒక వాహనంపై రాళ్లు రువ్విన ఘటనలో ట్రక్కు డ్రైవర్ మృతిచెందాడు. అనంత్‌నాగ్ జిల్లా జ్రాదిపొర ప్రాంతంలో నూర్‌మహ్మద్ అనే వ్యక్తి ట్రక్కులో సరుకులు నింపుకుని వెళుతుండగా సైనిక వాహనంగా భావించి అల్లరిమూకలు రాళ్లు రువ్వాయి. ఘటన విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకి వచ్చారు. గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే అతను మృతిచెందాడు. ఈ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేసి విచారిస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ లోయలో ఆంక్షలు కొనసాగుతున్న వేళ ఈ ఘటన జరగటం చర్చనీయాంశం అయింది.