జాతీయ వార్తలు

ప్రతి ఐదింటిలో ఒకటి నకిలీనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహార పదార్థాల పరీక్షల్లో వెల్లడైన చేదు నిజం
2,795 కేసులు... 11కోట్ల జరిమానా వసూలు
ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక కేసులు

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: మార్కెట్‌లో లభ్యమయ్యే ప్రతి ఐదు ఆహార పదార్థాల్లో ఒకటి కల్తీ అని తేటతెల్లమైంది. కేసులు నమోదవుతున్నా, జరిమానాలు విధిస్తున్నా కల్తీ యధేచ్ఛగా సాగుతోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆహార పదార్థాల కల్తీలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా, పంజాబ్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జాతీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ చేదు నిజం బయటపడింది. ప్రతి ఐదు ఆహార పదార్థాల్లో ఒకటి కల్తీగా రుజువైందని సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటివరకు 2,795 కేసులను నమోదు చేసి, 10.93 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేసినట్లు పేర్కొంది. 1,402 కేసుల్లో నిందితులకు శిక్షలు కూడా పడ్డాయని వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ 24 వరకు 74,010 శాంపిల్స్ పరీక్షకు రాగా, వాటిల్లో 83,265 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు పేర్కొంది. వీటిల్లో 14,599 శాంపిల్స్ నకిలీగా నిర్ధారణ అయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 4,119 శాంపిల్స్ నకిలీగా పరీక్షల్లో తేలడంతో దేశంలోనే ఈ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ 1,458 శాంపిల్స్, మధ్యప్రదేశ్ 1,412 శాంపిల్స్, గుజరాత్ 1,243, మహారాష్ట్ర 1,162, తమిళనాడు 1,047 శాంపిల్స్ నకిలీగా తేలాయి. ఇప్పటివరకు 2,795 కేసుల్లో 10.93 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు పేర్కొంది. కాగా ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన కేసుల్లో అత్యధికంగా 5.98 కోట్ల జరిమానాను విధించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లో మ్యాగీపై నిషేధం విధించడంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సలహా బోర్డు పనితీరును ప్రశ్నించడంతో పాటు ఆహార పదార్థాల తయారీదారులు ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయమై ముందుగానే క్లియరెన్స్ తీసుకోవాలని ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐతోపాటు రాష్ట్రాలకు చెందిన బోర్డులను రూ. 1,750 కోట్లతో బలోపేతం చేసే ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.