జాతీయ వార్తలు

దోషులను శిక్షించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్ గ్యాస్ బాధితుల డిమాండ్ దుర్ఘటనకు 31 ఏళ్ళు

భోపాల్, డిసెంబర్ 3: వేలాదిమందిని విగతజీవులను చేసి, లక్షలాది మందిని వైకల్యానికి గురిచేసిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి 31 సంవత్సరాలైంది. ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక దుర్ఘటన జరిగిన మూడు దశాబ్దాలు దాటినా కారకులైన దోషులకు ఇంతవరకూ శిక్ష పడలేదు, బాధితులకు పూర్తిగా న్యాయమూ జరగలేదు. 1984 డిసెంబర్ 3న భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కంపెనీలో జరిగిన ఈ గ్యాస్ దుర్ఘటన బాధితులు న్యాయం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. విషవాయువులనుంచి ప్రాణాలతో బయటపడి వైకల్యంతో జీవనం కొనసాగిస్తున్న వందలాదిమంది గురువారం ర్యాలీ నిర్వహించారు. వీరి ఆందోళనకు సంఘీభావంగా దేశ విదేశాలకు చెందిన వివిధ సంస్థలు ప్రతినిధులు హాజరయ్యారు. భోపాల్‌లోని భరత్ టాకీస్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పాల్గొన్న గ్యాస్ బాధితులు, స్థానికులు నినాదాలతో హోరెత్తించారు. దోషులను శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని నినదించారు. కంపెనీ ప్రాంగణంలో రసాయన పదార్థాల చెత్తను వేయడం వల్ల భూగర్భ జలాలు విషపూరితమయ్యాయి. ఈ జలాల వల్ల సమీప ప్రాంతాల్లో నివసించేవారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఈ ర్యాలీలో ఎక్కువ సంఖ్యలో బాధిత ముస్లింలు పాల్గొన్నారు. యూనియన్ కార్బైడ్‌కు, ప్రస్తుత యజమాని అయిన డౌ కెమికల్స్ కంపెనీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. బాధితులకు ఇప్పటికైనా న్యాయం చేయాలని, దోషులను చట్టం ముందు నిలబెట్టాలని వారు నినదించారు. అమెరికాకు చెందిన ఈ కంపెనీ పెద్దలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షిస్తున్నాయని ఆరోపించారు. బాధితులకు ఆర్థిక సహకారం, వౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఈ ర్యాలీకి మద్దతు పలికిన స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు కమిటీ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో పెట్టకపోవడం దురదృష్టకరమని భోపాల్ గ్యాస్ పీడిత్ మహిళా స్టేషనరీ కరమ్‌చారీ సంఘ్ అధ్యక్షురాలు రషీదా బీ ఆవేదన వ్యక్తం చేశారు. (చిత్రం) భోపాల్ గ్యాస్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిర్వహించిన ర్యాలీ