క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు అథ్లెట్‌ ద్యుతిచంద్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రియో ఒలింపిక్స్‌కు భారత అథ్లెట్‌ ద్యుతిచంద్‌ అర్హత సాధించింది. 11.32 సెకండ్లలో 100మీటర్ల పరుగును పూర్తిచేసిన వారికి రియోలో అర్హత దక్కుతుంది. కజకిస్థాన్‌లో జరిగిన 26వ కోసనోవ్‌ మెమోరియల్‌ మీట్‌ పోటీల్లో మహిళల 100మీటర్ల విభాగంలో ద్యుతి విజయం సాధించడంతో పాటు రియో టికెట్‌ దక్కించుకుంది. శనివారం జరిగిన పోటీల్లో ద్యుతి ఈ పరుగును 11.30సెకండ్లలోనే పూర్తి చేసింది. అంతేగాక.. ఈ విజయంతో ద్యుతి 100మీటర్ల విభాగంలో తన పేరుతో ఉన్న రికార్డును తిరగరాసింది. ఒలింపిక్స్‌లో అర్హత పద్ధతిని ప్రారంభించిన తర్వాత మహిళల 100 మీటర్ల విభాగంలో చోటు సాధించిన తొలి మహిళ ద్యుతి కావడం విశేషం.