ఉత్తరాయణం

శాతకర్ణి- బ్రాహ్మణ చక్రవర్తే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహస ధైర్య నిష్ఠాపరుడైన శాతకర్ణి అసలు సిసలైన సార్వభౌముడు! బ్రాహ్మణ వర్గీయులు అక్కన్న- మాదన్న మంత్రులుగా తమ ప్రతిభతో, చాతుర్యంతో రాజ్యపాలనకు మార్గదర్శకులైనారు. అటు రాజ్యాధికార ప్రభువులుగా, ఇటు మంత్రి పదవులు అలంకరించిన బ్రాహ్మణులు సవ్యసాచులు అనుటకు ఇదే నిదర్శనం. ‘శాతకర్ణి’ గురించి జ్వాలా నరసింహారావు విశే్లషణ ఇందుకు చారిత్రక నిలువుటద్దం. దీనిని కాదనుటకు సాహసించేవారు ఎంతమంది? నేడు బ్రాహ్మణ ద్వేషము ఆవరించి చరిత్రను తుంగలో తొక్కుటకు అనేక ప్రయత్నాలు సాగుట శోచనీయం. చరిత్రను వక్రీకరించి గౌతమి పుత్ర శాతకర్ణిని బ్రాహ్మేణేతరునిగా చిత్రీకరించుట సర్వ అరిష్టాలకు మూలం!
-కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
ఇదేనా.. సంక్రాంతి కానుక?
రేషన్ షాపులలో ఇటీవల సంక్రాంతి కానుకగా బెల్లం వగైరా సరకులు ఇచ్చారు. కానీ, బియ్యం, చక్కెర ఇవ్వలేదు. తర్వాత ఇస్తామని రేషన్ డీలర్లు చెప్పారు. కొంతమంది పండుగ రోజులలో రేషన్ షాపులు ఉండవని భావించి, ఆ తర్వాత వెళ్లి బియ్యం, పంచదార అడిగితే ‘పండగులకు ముందే ఇచ్చాం, కొంచెం ఆలస్యంగా ఇచ్చాం. ఇప్పుడు మిషన్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇవ్వలేమ’ని రేషన్ డీలర్లు చెప్పడం విడ్డూరం. నిత్యావసర సరకులు అన్ని షాపులకు ఒక్కసారి పంపిస్తే ప్రజలు తీసుకోగలుగుతారు. మొత్తానికి ఏపిలో ఈ ఏడాది సంక్రాంతికి ప్రభుత్వం ప్రకటించిన కానుకలేమిటో అర్థం కాలేదు. బియ్యం, పంచదార ఇవ్వకపోవడమే సంక్రాంతి కానుకా?
-ఎ.వి.ఎన్.ప్రవీణ్ చంద్రకుమార్, కావలి
పనిచేయని ఆటోల మీటర్లు
జంట నగరాల్లో ఆటోల మీటర్లు పనిచేయవా? పనిచేసినా ఛార్జీలు వర్తించవా? గతంలో జనం బేరమాడి రిక్షాలపై వెళ్లేవారు. నేడు ఆటోలకు అదే పరిస్థితి ఏర్పడింది. మీటరు వేయని ఆటోలపై చర్యలు ఉండవా? రవాణా, పోలీసు శాఖల ప్రమేయం శూన్యమేనా? పెట్రోలు, గ్యాస్, డీజిల్ ధరలు తరచూ పెరగడం, ఒక్కసారి తగ్గడం జరుగుతోంది. ఇలా పెరిగినప్పుడు ఆటో ఛార్జీలు పెంచుతున్నారు కానీ తగ్గినప్పుడు ఏ మాత్రం తగ్గించరు. ప్రతిసారీ మీటర్లను సరిచేయాలంటే ఆటో డ్రైవర్లకు తలకుమించిన భారం. ఇంధన ధరలు పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు కిలోమీటర్లకి ఇంతని ఒక చార్ట్‌ను అధికారులు ప్రకటిస్తే ఏ గొడవా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తే అందరికీ మేలు జరుగుతుంది.
-సి.వి.ఆర్.కృష్ణ, హైదరాబాద్
హుజూరాబాద్ పేరు మార్చొద్దు
హుజూరాబాద్ పట్టణానికి అలనాటి హుజూర్ గౌరవార్థం పెట్టిన పేరును మార్చవద్దు. ఈ పేరు ముస్లింల మనోభావాలకు ప్రతీకగా నిలిచి వుంది. రాబోయే రోజుల్లో ప్రజల సౌకర్యార్థం హుజూరాబాద్‌ని జిల్లాగా ప్రకటించినా సరే ‘హుజూరాబాద్’గానే వుంచాలి తప్ప మరో తోక ఏదీ తగిలించవద్దు. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి కంటే మెరుగైన రవాణా మార్గాలున్న హుజూరాబాద్‌ను ఇప్పటికే జిల్లా కేంద్రంగా చేయవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి హుజూరాబాద్ ప్రాంత వాసుల ఆకాంక్షలను గుర్తించాలి.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్