ఉత్తరాయణం

పళని ‘యోగం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సేలం సేనాపతి’గా పేరుమోసిన ఎడప్పాడి కె.పళని స్వామి తమిళనాడు ముఖ్యమంత్రిగా గురువారం పదవీ స్వీకార ప్రమాణం చేయడం ‘పర నియంత్రిత’- రిమోట్ కంట్రోల్డ్- రాజకీయ చరిత్రలో మరో విచిత్ర ఘట్టం! అందని ద్రాక్షకు అర్రులు చాచిన మహిళా జంబుకం వలె తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపైకెక్కబోయి బొక్కబోర్ల పడిన ‘అఖిల భారత అన్నా ద్రవిడ మునే్నత్ర కజగం’ అధినేత్రి వి.కె.శశికళా నటరాజన్ ‘నియంత్రణ’ కొనసాగనున్నదన్నది ప్రస్తుత వాస్తవం. ‘పళని స్వామి శశికళ చేతి కీలుబొమ్మ’ అన్నది జరుగుతున్న ప్రచారం. తాను కీలుబొమ్మను కాదని పళని స్వామి కూడ ప్రకటించడం లేదు. తాను ‘అన్నాద్రముక’ శాసనసభా పక్షం ఎన్నిక చేసిన నాయకుడినని, ఎవరికీ చేతిబొమ్మను కాదని పళని స్వామి ప్రకటించలేదు. శశికళ చేతి ఆటబొమ్మ హోదా లభించడమే తనకు గొప్ప అన్నది పళని స్వామి భావమని మంగళవారం నాడు ఆయనను ఎంపిక చేసినప్పటి నుంచి జరుగుతున్న తతంగం వల్ల స్పష్టమైపోయింది. శశికళ బెంగళూరు జైలు నుంచి ‘దూర నియంత్రణ’ ద్వారా పళని స్వామిని నడిపిస్తుంది, ఆమె పంపే సంకేతాలకు అనుగుణంగా పళని పరిపాలనను అభినయిస్తాడన్నది ప్రస్తుతానికి పరిశీలకుల విశ్వాసం. ఆయన ప్రభుత్వం ఎంతకాలం సాగుతుందన్నది మాత్రం ఊహలకు పరిమితం. ఎందుకంటే అవినీతిపరురాలిగా సర్వోన్నత న్యాయస్థానంలో నిగ్గుతేలి కారాగార వాసం పాలైన శశికళ పట్ల తమిళుల ‘అభిమానం’ క్రమంగా అంతరించిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె పట్ల ‘అన్నాద్రముక’ శాసనసభ్యులకు మాత్రమే భయభక్తులున్నాయని స్పష్టమైంది. ప్రజలకు శశికళ పట్ల అభిమానం అంతం మాత్రమేనన్నది కూడ ధ్రువపడిన సత్యం. దివంగత ముఖ్యమంత్రి జయలలితకున్న ప్రజాభిమానం తనకు వారసత్వంగా లభించిందన్నది శశి అభినయం మాత్రమే! ప్రస్తుతం ఆమె పట్ల భయంతో పళని స్వామిని ముఖ్యమంత్రిగా అంగీకరించిన శాసనసభ్యుల్లో ఎంతమంది జారుకుంటారన్నది వేచి చూడాల్సిన వ్యవహారం. పళని స్వామి మాత్రం పదవిలో ఉన్నంత కాలం శశికళ చేతి దూర నియంత్రణకు గురికాక తప్పదు. జయలలిత పట్ల మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అభినయించిన స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా శశికళ పట్ల వినయ విధేయతలను నటించడం పళని పదవీ నిర్వహణకు అనివార్యం. శశికళ పళనిని దూరం నుంచి మాత్రమే నియంత్రించడం లేదు. సమీపం నుంచి ప్రత్యక్షంగా నియంత్రించి నిర్దేశించడానికి వలసిన వ్యవస్థను నిర్మించిన తర్వాతే జైలుకు వెళ్లింది. ఆ వ్యవస్థ టిటివి దినకరన్‌ను ‘అన్నాద్రముక’ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించడం..
దినకరన్, ఎస్.వెంకటేశ్ అనే శశికళ కుటుంబ సభ్యులను గతంలో జయలలిత పార్టీ నుంచి వెళ్లగొట్టింది. 2011 డిసెంబర్‌లో వారిద్దరినీ, ఇప్పుడు జయలలిత తానేనన్నట్టు ప్రదర్శన విన్యాసాలను సాగిస్తున్న శశికళనూ, మరో తొమ్మిది మందిని జయలలిత పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత కాళ్లావేళ్లా పడిన శశికళను మాత్రం జయ తిరిగి పార్టీలో చేర్చుకొంది. దినకరన్‌తోను, ఎస్.వెంకటేశ్‌తోను, ఇతర కుటుంబ సభ్యులతోను తెగతెంపులు చేసుకున్నట్టు బాస చేసిన తర్వాతనే శశికి జయలలిత పార్టీలోకి పునర్ ప్రవేశం కల్పించింది. దినకరనాదులు బయట ఉండిపోయారు. దినకరన్ తదితర శశికళ కుటుంబం పట్ల జయలలితకు ఆగ్రహం ఆమె మరణించే నాటికీ తగ్గలేదు. అలాంటి దినకరన్‌ను, వెంకటేశ్‌ను మళ్లీ పార్టీలో చేర్చుకొనడం మాత్రమే కాక దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించడం జయ పట్ల శశి చేసిన నమ్మక ద్రోహం! తాను జైలులో ఉన్న సమయంలో దినకరన్ ప్రధాన కార్యదర్శి అధికారాలన్నింటినీ చెలాయిస్తాడని శశికళ నిర్దేశించడం శాసనసభ్యులను ఆమె కట్టుబానిసల వలె భావిస్తోందనడానికి సరికొత్త సాక్ష్యం!
ఇలా పార్టీలోకి ఐదేళ్ల తర్వాత చొరబడిన దినకరన్ చొరబడిన వెంటనే నిర్వాహక ప్రధాన కార్యదర్శి అయిపోవడం ప్రజాస్వామ్యానికి, సంస్థాగత పారదర్శకతకు భయంకరమైన విఘాతకరం. అయినప్పటికీ పళని స్వామి కాని, ఇతరులు కాని నోరు మెదపకపోవడం ‘పదవీ స్వామ్య’ రాజకీయాల్లో భాగం. పళని స్వామి కాని, అయ్యగారికి మద్దతు ఇస్తున్న నూట ఇరవై ముగ్గురు శాసనసభ్యులలో ఏ ఒక్కరు కాని స్వయంగా ఏ ఎన్నికలోను గెలవలేని వారు. అందువల్ల ‘జయ గెలిస్తే తమది గెలుపు, ఓడితే తమది ఓటమి’ అన్న రీతిలో వీరు మనుగడ సాగించారు. ఇదే సూత్రాన్ని అవినీతికి పాల్పడిన నేరస్థురాలు శశికళ పట్ల కూడ పళని స్వామి బృందం అన్వయించుకోవడం వారి మరుగుజ్జు స్వభావానికి, నైతిక నిబద్ధతారాహిత్యానికి అద్దం.. ఇంతగా పళని స్వామి విధేయతను నిరూపించుకొన్నప్పటికీ ఆయనపై నిఘా వేసి ఉంచడానికి తన కుటుంబంలోని దినకరన్‌ను నెలకొల్పి పోవడం శశికి పళని పట్ల అవిశ్వాసానికి నిదర్శనం. పళనిపై దూర నియంత్రణ శశికళది, ప్రత్యక్ష నియంత్రణ దినకరన్‌ది. ఇలా అనుచరులను నమ్మని శశికళ, తన నాయకురాలి పట్ల నమ్మక ద్రోహాన్ని ఆచరించడం గత ఐదవ తేదీన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి కొనసాగుతున్న నాటకంలోని ఇతివృత్తం. 2012 మార్చిలో తిరిగి పార్టీలో ప్రవేశించడానికి వీలుగా జయకు సమర్పించిన ‘పశ్చాత్తాప పత్రం’లో శశి ఇలా వాగ్దానం చేసింది. ‘నేను శాసన సభ్యత్వం కాని పార్లమెంటు సభ్యత్వాన్ని కాని కోరను.. మంత్రిని కావాలని కోరడం లేదు.. ప్రభుత్వ భాగస్వామ్యం వాంఛించడం లేదు. రాజకీయాల పట్ల నాకు మక్కువ లేదు. అక్క- జయలలితకు నిజమైన చెల్లెలి వలె ఆమెను సేవించడమే నా జీవితం, నాకు ఇతర జీవితం అక్కరలేదు..’ ఈ ప్రతిజ్ఞకు అనుగుణంగానే శశికళకు పార్టీ పదవిని కాని శాసనసభ్యత్వాన్ని కాని ఇతర అధికార పదవులు కాని జయ కట్టబెట్టలేదు. ముఖ్యమంత్రి కావాలని కోరుకొనడం ద్వారా శశి ఈ వాగ్దాన భంగం చేసింది. జైలుకు వెళ్లిన తర్వాత కూడ ఆమెకు తాను వాగ్దాన భంగం చేశానన్న పశ్చాత్తాపం కలగకపోవడం పళని స్వామిని వేధించనున్న వైపరీత్యం!
పళని స్వామి నాయకుడేమీ కాదు, ‘సేలం సేనాపతి’గా పార్టీ స్థానిక కార్యకర్తలు ఆయనను పిలిచినప్పటికీ జనం మాత్రం ఆయనను గుర్తించిన దాఖలా లేదు. ఆర్‌పి రావణన్ అనే సమీప బంధువు సహాయంతో శశిని ఆశ్రయించిన పళని 1989లో శాసనసభ్యుడయ్యాడు. 1996లో, 2006లో ఆయన ఓడిపోయాడు. 2004లో లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం మంత్రి పదవులు దక్కని శాసనసభ్యుల్లో కొందరైనా పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయే ప్రమాదం ఉందన్నది పళని ప్రమాణ స్వీకారోత్సవానికి సమాంతంరంగా జరిగిన ప్రచారం. ఏడుమంది శాసనసభ్యులు ఫిరాయించినట్టయితే స్వామి ప్రభుత్వం ‘సభ’లో మెజారిటీ కోల్పోతుంది! గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు పళని స్వామిని పదిహేను రోజుల్లో సభావిశ్వాసం పొందడానికి అవకాశం ఇచ్చాడు. అయితే, శనివారం నాడే సభా విశ్వాసం పొందాలని పళని స్వామి నిర్ణయించడానికి కారణం కాలం గడిచేకొద్దీ ఫిరాయింపులు జరిగే ప్రమాదం ఉందన్న భయం..