వీరాజీయం

ముట్టుకుంటే కక్కాలి యాభైవేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయి బార్ డ్యాన్స్ క్లబ్‌లు, రెస్టారెంట్లు- అటు గవర్నమెంటుకీ - యిటు కోర్టులకీ మధ్యన/ పడి- అడకత్తెరలో వక్కలాగా నలిగిపోతున్నాయి. ఓ పదేళ్లయింది- మహారాష్ట్ర ప్రభుత్వానికీ, బార్ల వాళ్లకీ మధ్య సుప్రీంకోర్టు సహా కోర్టులు మధ్యవర్తులుగా- ఒక యుద్ధమే జరిగిపోతోంది. కోర్టులు, మధ్యవర్తులు అనుకోడమే కాదు 75వేల మంది సుందరాంగనలు రుూ బార్ డ్యాన్సులలో- ఐటమ్‌సాంగ్స్‌కి డ్యాన్సులు చేసి, పొట్ట పోషించుకుంటున్నారు. ఈ ‘‘బార్’’లు మూతపడితే, రుూ నర్తకీమణుల ‘తిండి సంపాదన’ అనే హక్కుపోతుందీ అనే, జోక్యం చేసుకుంటోంది కోర్టు- అదే సదుద్దేశంతో సుప్రీంకోర్టు మార్చి 15నాటికి ముంబాయి ‘‘బార్‌గాళ్స్’’కి ఉపాధి కల్పిస్తూ మందు, విందు కను పసందుగా వినోదం అందించే క్లాసు రెస్టారెంట్లకు అనుమతి యివ్వమన్నది కానీ- ‘‘అశ్లీలం, అక్రమం, అభ్యంతరకరం అయిన బార్ డ్యాన్సులు- సంఘానికి చెరుపుచేస్తే- ‘చూస్తూ చూస్తూ, సహించబోం’ అంటూ ఏదో ఒక సాకున ముంబాయి ‘‘సెక్సు డ్యాన్సు క్లబ్‌ల’’కు అడ్డంపడిపోతూనే వుంది గవర్నమెంటు. ఈ నృత్య గాన వినోదం సాకున వ్యభిచారం, అసభ్య, అశ్లీల సెక్సు నాట్య ప్రదర్శనలు జరిగిపోడాన్ని- మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంతమాత్రం సహించదు’’-అంటూ ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌గారు ప్రకటించాడు చాలాసార్లు.
అంతేనా? ఒక పాతిక మందితో ఒక కమిటీని వేసి, ఒక పకడ్బందీ ముసాయిదా బిల్లును తయానరచేయంచాడు. ఈలోగా బార్‌లు సుప్రీంకోర్టు తలుపు తడుతూనే వున్నాయి.
నామ్‌కే వాస్తే కొన్ని మోతుబరి క్లబ్‌లు డ్యాన్స్ విందులకు పర్మిట్‌లు కూడా సంపాదించాయి. ఐతే, గవర్నమెంట్- పాము చావకుండా- కర్ర విరగకుండా- రుూ బార్‌ల ఆటకట్టిస్తూనే, ఒక కొత్త చట్టం చేసింది. అది అట్లుండనిండు.
ఈలోగా డ్యాన్సర్లు గంపెడంత ఆశతో- లేటెస్ట్ డ్యాన్సులు సినిమా ఐటమ్‌సాంగ్స్ ప్రాక్టీసు చేశారు. కానీ రుూ కొత్త చట్టంలోని షరతులు, నియమాలూ, ఆంక్షలూ వగైరా చూస్తే- బార్‌లకీ, బార్ డ్యాన్సర్లకీ కూడా కాళ్లు చచ్చుబడిపోయాయ్. ఈ మాదిరి బార్ డ్యాన్సులు ఝా మ్మని వేయించి నాలుగురాళ్లు చేసుకోడం అసాధ్యం. ‘‘ఇంతకన్నా ‘‘మెరైన్ డ్రయివ్’’లో ముష్టెత్తుకోడం బెట ర్’’- అన్నాడుట ఓ బార్ డ్యాన్స్ క్లబ్ ఓనర్.
ఇది ‘‘చట్టం’’కాదు. కత్తుల బోనుగా అభివర్ణించబడుతోంది. బార్‌లూ, బార్‌గాళ్స్ కూడా సన్నాసుల్లో కలవాలనిపించేలాగ రూల్సుపెట్టారు.
‘‘బార్‌గాళ్స్-’’ అంతా కనబడేలాగా పల్చని దుస్తులు ధరించకూడదుట. పాతికేళ్ల వయస్సుదాటిన వాళ్లకే ‘‘గానా- పీనా బజానా’’ కార్యక్రమాల్లోకి ‘‘అలవెన్స్’’ అంతేనా? ఈ డ్యాన్సులు చూడటానికి వచ్చే పెద్దమనుషులు- ‘పాతికేళ్లకన్నా పెద్దవయసు వాళ్లం’అన్న సర్ట్ఫికెట్ జేబులో పెట్టుకుని రావాలి. పైగా రూల్సుని ‘్భగ్నం’చేస్తే బార్ ఓనర్లు పాతిక వేల రూపాయల జరిమానా కట్టాలి! ఒక్కోసారి నేరం మరీ లోతుఅయిందీ అయితే- ఐదేళ్లు కటకటాల వెనక్కి వెళ్లాలిట- ఔరా! మరీ ఇంత శి(క)క్షా.
ఇక ఈ బార్ క్లబ్‌లా? అవి జన వాసరాలకీ, స్కూళ్లకీ, దేవాలయాలకీ కనీసం ఒక కిలోమీటర్ దూరంగావుండి తీరాలి. సాయంకాలం 6 గంటల నుంచీ రాత్రి 11.30 గంటల దాకానే- గానా, పీనా, బజానా. ఆనక ఓ బ్యాంగ్‌మన్న చప్పుడు వినిపిస్తే- ఓ డ్యాన్సర్ కనిపిస్తే, తీసుకుపోయి మూసేస్తారు. అంతేనా? నృత్యగాన మద్యప్రియులు ఎవరేనా సరే- ఎంతవారలైనా సరే డ్యాన్సర్ల వేదికకి పది గజాల దూరంగానే కూర్చుని- ‘బుద్ధి’గా ‘మడి’గా నర్తాంగనల వొంపుసొంపుల, కులుకు పలుకులను ఆస్వాదించాలి. అలాగాకుండా, ‘వహ్వా’లు, కేరింతలు కొడుతూ, బార్‌గాళ్స్ మీదికి పైసలు విసరకూడదు అంటే, నాణాలయితే నొప్పి పెట్టడం, దెబ్బతగలడం జరుగుతుంది కనుక, కరెన్సీ నోట్లని విసురుతాము అంటారేమో? అదేం కుదర్దు. ‘‘పూలు’’ అయినాసరే కూడా విసరకూడదు.
మహారాష్ట్ర ‘‘జావళీల’’ రాష్ట్రం. ఠేవిణీలకు పెట్టిందిపేరు. కానీ, రుూ బార్‌గాళ్స్‌కి సదరు వేషాలు చెల్లవ్.
అలా చూడలేక, తాపం తట్టుకోలేక, ఎవరేనా రసిక పురుషుడు- సాముదాయకపు వలపు పంపిణీ విన్యాసాలు చేస్తూన్న నృత్యాంగనల మెత్తని వొంటి మీద- అదే, నడుం మీదనో, పిర్రమీదనో, భుజాల మీదనో- పోనీ బుగ్గలమీద చిటిక వెయ్యడమో? చేస్తే- లేదా కొంగట్టుకునో, షెల్వార్ పట్టుకునో- విలాసంగా లాగితే ‘‘్ఫనిష్!’’ యాభైవేల రూపాయల జరిమానా క్రక్కాల్సి వుంటుంది. ముక్కుపిండుతారు ‘‘ఫైన్’’కోసం!
పైగా రెస్టారెంట్ బార్ గేట్‌లో సి.సి. కేమెరాలు, వేదిక ముందు కూర్చున్న వాళ్లమీద సి.సి.కేమెరాలు, లేడీ భద్రతా సిబ్బంది, మగ ముష్కర నిఘా సురులు- యిలా రకరకాల నిఘాలుంటాయి. రసిక జన మానసోల్లానికి కావల్సిన యిటువంటి ‘‘గ్రాండ్’’ఏర్పాట్లు వున్నచోటికి- జేబుల నిండా పైసలు క్రుక్కుకుని వెళ్లి అక్కడ క్రుక్కిన పేనుల్లాగా, బుద్ధిగా కూర్చుని- రికార్డింగ్ డ్యాన్సులు చూసే- ‘‘డన్సు’’లుంటారా?
‘‘డ్యాన్స్’’ అంటే ‘‘బార్ బార్ దేఖో- హజార్ బార్ దేఖో-గా వుండాలి- అంటున్నారు క్లబ్ పక్షులు.
బార్ బార్ అంటే మందు బార్‌లనీ- బార్ బార్- అనగా ‘‘మళ్లీ మళ్లీ - వాటిని చూడమనీ పై పాటకర్థం. ఇలాంటి అర్థాలకి న్యాయం చేయాలీ అంటే- మజామజాగా మధురసం- రంభా, ఊర్వశీ, తిలోత్తమలను తలదనే్న భామామణుల నృత్యాదులు వుండాలి. అప్పుడే ‘‘వ్రతం చేయించిన వాడికో- చేసిన వాడికో ఫలం దక్కుతుంది. అంతేగానీ, రుూ ‘‘యు’’ట్యూబుల కాలంలో హీరోయినే్ల సినిమాలలో ఐటమ్ డ్యాన్సులు చేసి, అంగాంగ ప్రదర్శనలు చేస్తూ ‘శఠం గిఠం ‘శాయక’ శృంగారం వొలకబోస్తున్న ఈరోజుల్లో కేవలం ఉదర పోషణార్థం వొళ్లు ప్రదర్శించే అబలలకోసం, ఎవడండీ, వెంపర్లాడుతాడు? ఇన్ని ఆంక్షలుంటే...
అంచేత, మళ్లీ రుూ చట్టంమీద, హైకోర్టుకి పోతారు తప్పదు. వాళ్లకి బోలెడు పనిపడుతుంది. ఈలోగా ‘బార్’ ల వాళ్లు ‘‘బార్‌గాళ్స్- షరామామూలే. మెయిన్ డోర్లు మూసేసుకుని- సిసి కెమెరాలు లేని దొడ్డిదారులు తెరుస్తారు. అదీ సాగకుండా గవర్నమెంటు మోరల్ పోలీసింగ్‌ని తీవ్రతరం చేస్తే - గత్యంతరమేముంది?
దే విల్ గో టుది సుప్రీం కోర్ట్ అగైన్!?