ఉత్తరాయణం

మంచినీళ్లుగా సముద్రజలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్, మహారాష్టస్రహా పలు రాష్ట్రాలు కరువుకాటకాలతో తల్లడిల్లుతున్నాయి. త్రాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఎండ వేడిమికి పిట్టల్లా రాలిపోతున్నారు. ఎడారి ప్రాంతాలైన అరేబియా దేశాలలో చుక్కనీరు దొరకదు. వారు సముద్ర నీటిని ప్రాసెస్ చేసి ప్రజలకు త్రాగునీరు, పరిశ్రమలకు తగిన నీరు పుష్కలంగా అందిస్తున్నారు. మన దేశం మూడువైపులా సముద్రం వుంది. సూర్యరశ్మినుంచి విద్యుత్‌ను తయారు చేసినట్లు సముద్ర జలాలను త్రాగునీరుగా మార్చవచ్చును. కాబట్టి మిగతా అన్ని కార్యక్రమాలకు చేసే కోట్ల రూపాయల వ్యయాన్ని దీనికోసం వినియోగిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.
- ఈశ్వర్, ప్రొద్దుటూరు
మత మార్పిడులను అడ్డుకోవాలి
ప్రతీ వస్తువులో దైవాన్ని దర్శించి ప్రకృతిని పూజించే మతం హిందూ మతం. చెట్లని, పుట్టల్ని, సర్పాలనీ, గోవునీ, వివిధ దేవతల్నీ పూజించింది. అలాగే అతిథుల్ని చివరకు దేవుడు లేడన్న నాస్తికుల్ని ఆరాధించింది. నాస్తికత్వాన్ని ఓ మతంలా గుర్తించింది హిందూ మతం. అలాంటి హిందూ మతా న్ని నేడు కొన్ని విదేశీశక్తులు నాశనం చెయ్యడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ధనా న్ని ఆశచూపి మత మార్పిడులకు పాల్పడుతున్నాయి. హిందూ సంప్రదాయాలను కాలరాసి విదేశీ సంస్కృతిని అలవాటు చేస్తున్నాయి. ఇవన్నీ ప్రతీ హిందూ వ్యక్తి వ్యతిరేకించాలి. మత మార్పిడులను శాంతియుతంగా అడ్డుకోవాలి.
- కె.వి.చలం, విశాఖపట్నం
అంగడి సరుకుగా గాలి
స్వచ్ఛమైన గాలి ఇప్పుడు తాజాగా అంగడి సరుకైపోయింది. పంచభూతా ల్లో భూమి, నిప్పు, నీరు ఎప్పుడో అంగడి సరుకులయ్యాయి. విమానాలు, ఉపగ్రహ ప్రయోగాలు వచ్చాక ఆకాశంకూడా అంగడి సరుకు అయింది. ఇప్పుడు పంచభూతాలలో మిగిలిన గాలి వంతు! విదేశాల్లో ఎప్పుడో ఆక్సిజన్ కిమోస్క్ లు వచ్చాయి. మన దేశంలోనూ ఆక్సిజన్ సిలిండర్లు అమ్మబోతున్నారు. పంచభూతాలు అంగడి సరుకుగా మారడానికి కారణాలు మనిషి స్వార్థం, మేధ!
- ప్రభాస్, గాంధీనగర్
ఆంగ్లం అవసరమే
ప్రపంచీకరణ జరుగుతున్న దశలో ప్రజలు తమ ఊరు, వాడని విడిచి సముద్రాల ఆవల వేల మైళ్ళదూరంలోవున్న అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, లండన్, కెనడాకు చదువుకు, ఉద్యోగాలకోసమని బ్రతుకుదెరువు రీత్యా అక్కడికి వెళ్ళి స్థిరపడుతున్నారు. కనుక మనం అందరికీ అవసరమైన ఆంగ్లంని నేర్చుకోవడం అత్యంత ఆవశ్యం. ఇది ప్రతి ఒక్కరు గమనించవలసి వుంది.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్
పాత అభ్యర్థుల గతి ఏమిటి?
2013-2014, 2014-2015 పాత పదవ తరగతి విద్యార్థులు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిలబస్‌నే చదివి ఉన్నందున వారికి పాత సిలబస్ ప్రశ్నాపత్రాలు రూపొందిస్తే బావుండు. అలా చేయకపోవడంవలన కొత్త తెలంగాణా సిలబస్ ప్రశ్నాపత్రాలివ్వడం అభ్యర్థులు బిక్కమొహంవేసి, తెలుగుభాషా పరీక్షలో ఫెయిల్ విఫలమయ్యారు. కావున ఇప్పటికైనా జరిగిన పొరపాటును సవరించి 2013-14, 2014-15 పాత అభ్యర్థులకు పాత సిలబస్‌ను అనుసరించి పరీక్షాప్రశ్నపత్రాలు రూపొందించవలసిందని ముఖ్యమంత్రిని, విద్యామంత్రిని మరీ మరీ కోరుతున్నాము.
- గుల్‌ఫిష్ హసీనా, కరీంనగర్