ఉత్తరాయణం

మానవీయ కోణం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశమంతా వస్తు సేవలపై ఒకే పన్ను ఉండేందుకు ఉద్దేశించిన జీఎస్టీ బిల్లు రాజ్యసభలో అన్ని పక్షాల ఏకాభిప్రాయంలో పాస్ కావడం శుభ పరిణామం. అధికార, విపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం తోనే ఇది సాధ్యమైంది. పన్నుమీద పన్ను, రాష్ట్రానికో పన్ను తరహాలో సవాలక్ష పన్నుల స్థానంలో ఒకే పన్ను విధానం భరించే స్థాయలో సమంజసమైన స్థాయలో ఉండిలా తప్పితే నాలుగు పాతిక రూపాయల పన్నుల స్థానంలో ఒక్క నూటపాతిక రూపాయల పన్ను తరహా లో ఉంటే మాత్రం కష్టం. అపుడు దేశమంతా ఒకటే పన్ను-ఒకటే తన్ను అని భావించాల్సి వస్తుంది. రాష్ట్రాల మధ్య అంతరాలు, అదనపు వడ్డనలు ఉండని మూలాన తయారీదారుకి, పన్నులు ఎగ్గొట్టే అవకాశాలు తగ్గి ప్రభుత్వానికి ఇది లాభయాకమైన వ్యవహారమే అయనా ప్రజలకెంత ఉపయోగమో కాలమే తేల్చాలి. జిఎస్టీ పరిథి 18 శాతం కన్నా మించరాదని కోరుతున్న విపక్షాల వినతి ఆహ్వానించదగినది.
అయనా ప్రస్తుతం దేశంలో సగటు పౌరునికి కావలసిం ది పరోక్ష పన్నుల భారం తగ్గడం. పన్నుల శాతంలో 65 శాతం పరోక్షపన్నులే ఉండడం, ధనిక, పేద భేదం లేకుం డా అందరికీ సమానస్థాయలో వడ్డించడం అంటే పేదల పట్ల అన్యాయమే. కనుక ప్రభుత్వం పరోక్ష పన్నుల్ని గణనీయంగా తగ్గించేందుకు కృషి చెయ్యాలి. ఆ దిశగా చేసే ప్రయత్నాలకు జీఎస్టీ నాంది కావాలి. ఈ బిల్లు అన్ని స్థాయలూ దాటి చట్టమయ్యేలోగా దానికి మానవీయ కోణాన్ని కూడా జతపరచినప్పుడే ప్రజలకు నిజమైన మేలు.
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం
దోషాన్ని సరిదిద్దాలి
ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలు- వాళ్ల స్వార్థ ప్రయోజనాలకోసం - టి.డి.పి మరియు టీఆరెస్సె పార్టీలోకి దూకుతున్నారు. ఈ పార్టీ ముఖ్య నాయకులు గూడా రారమ్మని స్వాగత మాలలు వేస్తున్నారు. ప్రభుత్వ నియమాల ప్రకారం- ప్రతినిధులైన వారు, మరలా రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం వలసపోవాలి కదా! ఒక మతం నుండీ వేరొక మతం మారితేనే ఆ మత పెద్దలు వారిని పవిత్రించి, మంత్రించి కానీ తీసుకోరు. వారట్లా రాంగానే- వీరిట్లా కలిపేసుకుంటే ఎట్లా?అమాయకులు తప్పుచేస్తే తెలివిగలవారు ఆ దోషాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కానీ 60,000 గ్రంథాలను ఔపోసనం చేసిన మేధావులుగా మీరూ చేశారు- అందుకు మేమూ చేస్తాము అని పామరుల్లా చేయదగునా? దీనివల్ల సం దేశం ఏమిటంటే సామాన్యులందరూ- వారినే ఆదర్శంగా తీసుకోవాలి.
- ఏ.రోశయ్య, పాల్వంచ
మాతృభాష పట్ల నిర్లక్ష్యం తగదు
పాశ్చాత్య సంస్కృతి వెర్రితలలు వేస్తూ విదేశీ విద్యను స్వదేశీయ యువ మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతున్న కొద్ది స్వదేశీ విద్యను అందునా మాతృభాషను నిర్లక్ష్యం చెయ్యడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. మార్కులకోసం కార్పొరేట్ విద్యాసంస్థలు అనేక అడ్డదారులు తొక్కుతున్నాయి. ఇందులో ముఖ్యంగా తెలుగు భాష, తెలుగు సాహిత్యానికి తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు. పర్సంటేజి రాదన్న నెపంతో సంస్కృతం, ఫ్రెంచ్, జర్మనీ వంటి విదేశీ భాషలను సెకెండ్ లాంగ్వేజి క్రింద ప్రవేశపెట్టి తెలుగుకు 7వ తరగతి నుండి తిలోదకాలిచ్చేసారు. విద్యార్థులను తెలుగు భాషకు నీతి కథలు, ఇతిహాసాలు, శతకాలు, పురాణాలు, సాహిత్యం దూరం చేయ డం దారుణం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
విదేశీ తొత్తులు
ఉగ్రవాదులవల్ల వీర మరణం పొందిన భారత సైనికులకు హైదరాబాదు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు కొన్ని రాజకీయ పక్షాలు నీరాజనాలు అర్పించలేదు. కాని భారత సైన్యం చేతిలో హతమైన హిజబుల్ ఉగ్రవాది బుర్షాన్ వనీకి నీరాజనాలు అర్పించిన యూనివర్సిటీ విద్యార్థులు విదేశీతొత్తులు. పాకిస్తాన్‌కు జైకొట్టి ఉగ్రవాదులకు వత్తాసు పలికిన వారందరిపైన దేశద్రోహం నేరం కేసు పెట్టాలి.
సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
స్ర్తిలకూ కేటాయించాలి
గ్రంథాలయాలు విజ్ఞానదాయకాలు. అవి కేవలం మగవారికే అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి గ్రంథాలయంలోనూ స్ర్తిలకూ ప్రత్యేక విభాగం ఉండాలి. స్ర్తిలకోసం ప్రత్యేకమైన గదినో లేదా పెద్ద హాలు అయితే వారికి సగభాగమో కేటాయించాలి. గ్రంథాలయాలకు క్రమం తప్పకుండా వచ్చే దిన, వార, మాస పత్రికలను రెండు సెట్లుగా తెప్పించి ఒక సెట్‌ను స్ర్తిలకు అందుబాటులో ఉంచాలి. వారిని గ్రంథాలయాలకు వచ్చేలా ప్రోత్సహించాలి. గృహిణులకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం