ఉత్తరాయణం

స్ఫూర్తినిచ్చిన సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ క్రీడలో రజతం సా ధించిన తెలుగమ్మాయ సింధు యావద్దేశానికే స్పూర్తి నిచ్చింది. ముఖ్యంగా భారీ సంఖ్యలో క్రీడాకారులు రియో దారి పట్టినా, చివరి వరకు ఒక్కపతకమైనా వచ్చే సూచ నలేవీ దరిదాపుల్లో లేనప్పుడు ముగ్గురు మహిళల విజ యం దేశం పరువు నిలబెట్టింది. అందులో అగ్రగణ్య సిం ధు అయనప్పటికీ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షి, జిమ్నాస్టిక్స్‌లో ముందు వరుసల్లోకి వచ్చిన దీపిక కూడా అభినందనీయులే. ఈ ఒలింపిక్ విజయాలు దేశ పాల కులకు దిశానిర్దేశం చేయాలి. విజేతలను అభినందనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పెద్దలంతా తమ బాధ్యతను మరో సారి గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రపంచంలో అత్యధిక సం ఖ్యలో యువత కలిగిన మనదేశంలో క్రీడల్లో రాణించే అవకాశాల కల్పన మాత్రం పూజ్యం. క్రీడా సంస్కృతిని ప్రోత్సహించకపోగా, నిరుత్సాహపరచే వాతావరణమే మెండు. విద్యార్థి దశనుండే సరైన మైదానాలు, వసతలు, శిక్షణ, ప్రోత్సాహం లభిస్తే ఉత్తమ స్థాయ ప్రతిభ కనబర్చగల మెరికలు కోకొల్లలు. అయతే అన్నింటా వాళ్ల ను వెనక్కి లాగే వ్యవస్థలో మనమున్నాం. టాయలెట్ సౌ కర్యమే గగనమైన పాఠశాలల్లో మైదానాల గురించి మా ట్లాడడం అత్యాశ అయనప్పటికీ ఆ దిశగా కృషి చెయ్య కపోతే ఈ దుస్థితి మారేది కాదు. దేశంలో ఇకనైనా సింధు అందించిన స్ఫూర్తి కొనసాగాలి. క్రీడా సంస్కృతిని ప్రోత్స హించాలి. అది ఒక్క క్రీడాకారునికే పరిమితమైన విషయం కాదు. యువతలో క్రీడాస్ఫూర్తి పెరిగితే వారి మానసిక శారీరక ఆరోగ్యాలు ఉత్తమ స్థాయలో ఉండి, దేశానికి ఉత్తమ మానవ వనరులు అందుబాటులో ఉంటాయ. సమాజం మొత్తానికి ఈ బాధ్యత ఉన్నా, క్రీడా జ్యోతిని పట్టుకొని ముందు నడవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇది దీర్ఘకాలిక ప్రణాళిక. ప్రపంచ స్థాయ పతకాలు సాధించడం అన్నది అక్కడో మెరుపు, ఇక్కడో మెరుపు అన్నట్టుగా కాకుండా నిలకడగా ఉండేలా వ్యవస్థని తీర్చి దిద్దుకోవాల్సిన అవసరం ఇప్పుడు దేశం ముందు ఉన్నది.
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం
విభేదాలే కొంపముంచాయి
రియో ఒలింపిక్స్‌లో భారత్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో ఓడిపోవడానికి కారణాలు అందరికీ తెలిసిందే. ఇద్దరు ఆటగాళ్ళమధ్య విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళను ఇలాంటి అత్యున్నత పోటీలకు పంపడం అవసరమా? టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో ఆడే ఆటగాళ్ళ మధ్య విభేదాలు భారత్‌కు కొత్తేమీకాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళను ఒలింపిక్స్‌కు పంపడం వల్ల ఏమిసాధించాలనుకున్నారు. కొత్తవాళ్ళనైనా ప్రోత్సహిస్తే వాళ్ళకూ తృప్తిఉండేది కదా! మాతృదేశానికి పేరుతెచ్చే క్రమంలో ఆటగాళ్ళు తమ మధ్యనున్న వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి స్నేహపూర్వక వాతావరణంలో సమష్టికృషితో రాణిస్తే ఎంతో బా గుండేది కదా! భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృత్తం కా రాదు.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
అమలు జరపని చట్టాలెందుకు?
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాల మీద చట్టాల ను చేస్తున్నారు. కఠిన శిక్షలు తప్పవని ప్రకటనలు, హెచ్చరికలు చేస్తున్నా అవేమీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. ఆటపాటలతో, చదువు సంధ్యలతో ఆనందంగా గడపాల్సిన లక్షలాది మంది బాలల జీవితాలు కళ్లముందే బుగ్గిపాలవుతున్నాయి. పాలకుల మాటలు నీటిమూటలవుతున్నాయి. పాత చట్టాలకు మరింత పదునుపెట్టి పకడ్బందీగా సరికొత్త చట్టాలను తీసుకొచ్చామని నేతలు చెప్పుకుంటున్నా శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు ఏదో ఒక మార్గంలో ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. తాజాగా బాల కార్మిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చట్టాన్ని సవరిస్తూ మొన్ననే మరొక బిల్లునుపార్లమెంటు ఆమోదించింది. 14 సం.రాలలోపు పిల్లలు తమ కుటుంబానికి ఏదైనా పనిలో సహాయపడవచ్చు. కానీ ఇతరులు వారిని ఎలాంటి పనిచేయడానికి వినియోగించినా జైలుశిక్ష తప్పదని నేరంగా పరిగణిస్తున్నట్లు ఆ బిల్లులో పొందుపరిచారు. అంతేకాదు ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా జరిమానా కట్టాల్సి ఉంటుందని బిల్లులో స్పష్టం చేశారు. ఇదివరకు బిల్లులలో కూడా జరిమానాతోబాటు జైలుశిక్ష ఉండేలా ప్రకటనలు చేశారు. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఎన్నిచోట్ల బాల కార్మికులు పనిచేస్తున్నారో చూసి కూడా చూడనట్లే ప్రవర్తిస్తున్నారు అధికారులు. త్రికరణ శుద్ధిగా అమలుచేయలేని చట్టాలు ఎన్ని తెచ్చినా నిష్ప్రయోజనమే..
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
హోదా ఎందుకు?
2008లో భారత ప్రభుత్వం తెలుగు, కన్నడ, మలయా ళం, ఒడిశా భాషల్ని పురాతన భాషలుగా గుర్తించడాన్ని ఓర్వలేక ఒక తమిళ లాయరు కోర్టుకెక్కగా 8 ఏళ్లకు మద్రాసు హైకోర్టు ఆ వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఆంధ్రులు ఆరంభ శూరత్వంతో ఉప్పొంగిపోయారు. పురాతన హో దా లభించినా లాభం ఏమిటి? ప్రభుత్వ కార్యక్రమాలు, కోర్టు తీర్పులు ఆంగ్లంలోనే జరుగుతున్నాయి. విద్యార్థు లు లేరంటూ తెలుగు మాధ్యమ పాఠశాలలు మూసేస్తూ ఆంగ్లమాధ్యమాలు పెంచుతున్నారు. మాకు తెలుగు రా దండీ అని చెప్పుకోవడం గర్వకారణం అయింది. ఇంక హోదా ఏల?
- సోనాలి, సూర్యారావుపేట