ఉత్తరాయణం

హిందూ మతాన్ని కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ మతం ఇప్పుడు విదేశీ శక్తుల కబంధ హస్తాలలో నలుగుతోంది. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు హిందూ సమాజాన్ని పీడిస్తున్నాయి. చాలామంది ఈ సమస్యలను ఎదిరించలేక మతం మారుతున్నారు. లౌకిక రాజ్యంలో మతం మారడం తప్పుకాదు. కాని బలవంతంగా, ఒత్తిళ్లకు గురిచేసి మతం మార్చడం తప్పు. భారతదేశ సంస్కృతి హిందూ మతంపై ఆధారపడి ఉంది. హిందూ సమాజాన్ని ఇప్పుడున్న స్వాములు ఉద్ధరించడం లేదు. కేవలం మైక్‌ల ముందు ప్రవచనాలు చేయడం తప్ప ఆచరణలో ఏదిలేదు. హిందూ మతాన్ని కాపాడాల్సింది ప్రతీ భారతీయ హిందూ వ్యక్తి. మత మార్పిడుల నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టాలి.
- వి.కుమార్, విశాఖపట్నం
పోటీ పరీక్ష ద్వారా ఎంపిక చేయాలి
కళాశాలల్లో విద్యనందించే ఆచార్యులలో విషయ నిపుణత, కౌశలం మొదలైనవి ఉండి తీరాలన్న సదుద్దేశంతో కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా రాతపరీక్ష, వౌఖిక పరీక్ష నిర్వహించి, స్లెట్ లేదా నెట్‌ను తప్పనిసరి అని నిర్ణయించి, ఉపన్యాసకులను ఎంపిక చేయడం అత్యుత్తమ విధానం. ఎలాంటి రాత, వౌఖిక పరీక్షలు లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపై తీసుకొన్నవారి సర్వీసులను పర్మనెంటు చేయడం లక్షలాది నిరుద్యోగ విద్యావంతులకు రుచించడం లేదు. కాంట్రాక్ట్ పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తే ఏటా కొత్తవారికే అవకాశం ఇస్తే ఈ బాధ వుండేది కాదుకదా!
- కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్
పౌర సరఫరాల్లో అక్రమాలు
చౌక బియ్యం, కిరోసిన్ వంటివి రేషన్ డీలర్ల చేతుల్లోనుండి వక్రమార్గంలో అక్రమార్కుల చేతుల్లోకిపోతున్నాయి. రేషన్ బియ్యాన్ని విక్రయించి సొమ్ముచేసుకుంటూ కొందరు కుబేరులవుతున్నారు. డీలర్ల నుంచి కొంటున్న బియ్యాన్ని కొందరు దళారులు, వ్యాపారులు రాత్రివేళ రహస్యంగా రైస్‌మిల్లుల్లో డబుల్ పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చి ఆకర్షణీయమైన బ్యాగుల్లో ప్యాక్‌చేసి దూరప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. క్వింటాలు రూ.100లు ఉన్న రేషన్ బియ్యాన్ని నేడు క్వింటాలు రూ.3,000లకు విక్రయించుకుంటున్నారు. ఈ వ్యవహారం రెవెన్యూ అధికారులకు తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం గురించి సివిల్ సప్లయిస్ అధికారులకు ఎవరైనా సమాచారం ఇస్తే- ముందుగానే డీలర్లకు, మిల్లర్లకు తెలియచేస్తున్నారు. కొంతమంది డీలర్లు బియ్యాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా రహస్యంగా పొరుగు జిల్లాలకు తరలించి అమ్ముకుంటున్నారు. కిరోసిన్‌ది కూడా ఇదేతంతు. ఈ అక్రమాల్లో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ సంబంధిత ప్రభుత్వ సిబ్బందికి ప్రమేయం ఉంటుంది.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
పప్పులకు రంగులు..
ఇటీవల ప్రతి తినుబండారానికి ఆకర్షణ నిమిత్తం పలురకాల రంగులు వేయడం వ్యాపారస్థులకు అలవాటుగా మారింది. పలు వ్యాపార సంస్థలు తాము తయారుచేసే ఆహార పదార్థాలతో రంగులు కలిపి ప్రజలను నానా రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. 5 నుండి 15 ఏళ్లలోపు వయసు గలవారు వీటిని ఎక్కువగా తిని రక్తహీనత, అజీర్తి వ్యాధులతో బాధపడుతున్నారు. పప్పుదినుసులు, ప్రాసెసెడ్ ఫుడ్‌కు నానారకాల రంగులు కలిపి ప్రజలను రోగ పీడితులను చేస్తున్నారు. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పులకు ఆకర్షణ నిమిత్తం పసుపును పోలిన రంగులువేసి వ్యాపారస్థులు సొమ్ముచేసుకుంటున్నారు. పప్పులకు ఈ రంగులు అవసరమా? ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడాలి.
- కొలుసు శోభనాచలం, గరికపర్రు
అవగాహన లేని వ్యాఖ్యలు
అహింస, పరమత సహనం, విశ్వమానవ ప్రేమ భారతీయతకు పట్టు సోపానాలు. భారతదేశంలో ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయాలపై కొన్ని ప్రసార మాధ్యమాలు హద్దులు మీరి విమర్శించడం వేదనకు గురిచేస్తున్నది. వేదాలను, పురాణాలను, సంస్కృతాన్ని సరిగా అధ్యయనం చేయకుండా ‘పాపులారిటీ’ కోసం ప్రవచనకర్తలను, మన భారత సంస్కృతిని విమర్శించడం గొప్ప అనుకుంటే అది పొరబాటే అవుతుంది. ఆధ్యాత్మికవాదులు అంతా ఒకటే. మానవీయకోణం, మానవ విలువలుగల సమాజ నిర్ణేతలు వీరే. ప్రవచనాలు చెప్పేవారు కూడా ఒకరినొకరు విమర్శించుకోరాదు. అనుభవం, గ్రంథ విజ్ఞానం, విషయంపై కూలంకషంగా పరిశీలన లేకుండా మీడియా చేసే హడావుడి వల్ల సమాజానికి ప్రయోజనం శూన్యం.
- ప్రొఫెసర్ కె.ఎన్.రావు, కావలి
స్పీడ్‌బ్రేకర్ల బెడద
హైదరాబాద్‌లో విపరీతంగాను, మిగిలిన పట్టణాలలో తక్కువగాను కొంతమంది స్వార్థపరులు, పలుకుబడిగలవారు ఎవరి ఇష్టం వచ్చినచోట వారు స్పీడుబ్రేకర్లుకట్టి ప్రజల నడుములు విరగ్గొడుతున్నారు. వాహనాలను నాశనం చేస్తున్నారు. కొంతమంది షాపులవాళ్లు- రోడ్లపై స్పీడుబ్రేకర్లుంటే వాహనాల వేగం తగ్గి ప్రజల దృష్టి వారి వ్యాపారంమీద పడుతుందనే స్వార్థ పూరిత ఆలోచనతోను, మరికొంతమంది ఇతర ఆలో చనలతోను స్పీడుబ్రేకర్లు కట్టారు. ప్రభుత్వం అటువంటి వారిపై కఠినచర్యలు తీసుకుని అవసరంలేని చోట స్పీడుబ్రేకర్లు కొట్టివేయాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, ముఖ్యమైన కూడళ్లలో మాత్రమే స్పీడుబ్రేకర్లు ఉండాలి.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ