ఉత్తరాయణం

రోడ్డు ప్రమాదాలకు అంతం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న దేశాలలో అగ్రభాగాన నిలిచి మన దేశం ఇప్పటికే చాలా అప్రతిష్ట మూటకట్టుకుంది. రహదారి ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసే పాలకులు- ప్రమాదాల నివారణ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. అతి వేగం, మద్యం మత్తు, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడం, డ్రైవింగ్ చేతకాకపోయినా నేరుగా ఇంటికే లైసెన్స్ వచ్చే బ్రోకర్ల ప్రమేయం వంటివి రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరిగిపోతుండటానికి ఎన్నో కారణాలు. ప్రజలలో కూడా ట్రాఫిక్ సెన్సు తగ్గి, సాధ్యమైనంత త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఆరాటం కారణంగా అనునిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, రవాణా శాఖ, ట్రాఫిక్ విభాగం అవినీతి, అధ్వాహ్నస్థితిలో వున్న రహదారులు, కాలం చెల్లిన వాహనాలకు కూడా ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్లు ఇవ్వడం, హైవేలపై అడుగుకొక మద్యం దుకాణం.. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయ. ఈ ప్రమాదాలు తగ్గాలంటే జాతీయ రహదారులపై బార్‌లను, మద్యం దుకాణాలను తొలగించాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రోడ్లు నిర్మించలేనప్పుడు హైస్పీడ్ వాహనాలను ఎందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది?
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
చట్టాలెన్ని తెచ్చినా..
ఉగ్రవాదం, తీవ్రవాదం, స్ర్తిలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, కళాశాలల్లో ర్యాగింగ్ వంటి నేరాలు సమాజంలో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇటువంటి నేరాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. వీటి బారినుంచి ప్రజలను రక్షించ లేకపోతున్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు మాత్రం రాజకీయ నేతలు తీవ్రంగా స్పందిస్తుంటారు. బాధితులపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తుంటారు. వారికి ఆర్థిక సాయం అందిస్తుంటారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేసేవారి భరతం పడతాం.. మహిళలపై అత్యాచారాలు చేసే వారిని కఠినంగా శిక్షిస్తాం.. ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం.. అంటూ నేతలు వీరావేశంతో చెపుతుంటారు. నేరాల జరగకుండా సరికొత్త చట్టాలను తెస్తుంటారు. అయినా నేరాలు, ఘోరాలు అలాగే జరుగుతూనే వున్నాయి. అయితే, ఇతరులకు హాని తలపెట్టకూడదని, అలా హాని తలపెట్టడం చాలా తప్పని ఎవరికి వారు తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత మానసిక పరిపక్వత కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి మంచితనం మానవత్వం కలిగి ఉండాలి. మనుషుల్లో మంచిమార్పు రానంతవరకు ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం ఉండదు. ఈ పరిస్థితులు మారాలంటే బడుల్లో పిల్లలకు నైతిక విలువలను బోధించాల్సి ఉంది.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
ప్రమాదంలో ప్రజారోగ్యం
ఉత్తరాంధ్రలో ప్రజారోగ్య వ్యవస్థ పతనావస్థలో ఉంది. ఉత్తరాంధ్రలోని మైదాన ప్రాంతాలు సాధారణ వార్డులో ఉంటే, మన్యప్రాంతం మాత్రం ఐసీయూలో ఉన్నట్టుంది. అదే తేడా. ఐసీయూలో ఉన్న రోగి పట్ల పాటించాల్సిన అత్యవసర శ్రద్ధ ఇక్కడ కనబడకపోవడం శోచనీయం. మరణాలు సంభవించిన కొన్ని ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించినప్పుడు ఎక్కడా అవసరానికి తగిన అప్రమత్తత, సంసిద్ధత లేనట్లు ఎవరికైనా అర్థం అవుతుంది. రక్షిత మంచినీరు, పౌష్టికాహారం, సరిపడా మందులు, దోమల నివారణ చర్యలు, తక్షణ వైద్యసాయం అందే ఏర్పాట్లు తదితర విషయాలన్నింటిలోనూ మన్య ప్రాంతం తీసికట్టే. ప్రభుత్వ వైద్యకేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది, మందుల కొరత షరా మామూలే. ఇలాంటి వాతావరణం విద్యాహక్కుతోపాటు పిల్లలు జీవించే హక్కును కూడా నీరుకారుతోంది. పిల్లల తల్లిదండ్రుల భయాందోళనల వల్ల బడుల్లో డ్రాపౌట్ రేటు కూడా పెరుగుతోంది. దీర్ఘకాలిక నష్టాలు లెక్కపెట్టలేనివి. ఈ దుస్థితిని నివారించాలంటే ప్రభుత్వశాఖలకు సరిపడా నిధులను కేటాయంచాలి. యుద్ధప్రాతిపదికగా చేపట్టాల్సిన చికిత్స, వ్యాధి నిరోధక చర్యలతోపాటు దీర్ఘకాలికంగా ప్రజారోగ్యం మెరుగుపర్చేలా ప్రయత్నాలు జరగాలి. ఇలా ఆలోచించినపుడు ఉత్తరాంధ్రలో ప్రభుత్వ వైద్యకళాశాల అవసరం ఎంతో ఉంది.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
భారత్ సత్తా తెలిసింది..
పాకిస్తాన్‌లో తాజాగా సర్జికల్ ఆపరేషన్ (మెరుపుదాడి) చేసి భారత సైనికులు సత్తా చాటారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌కు ఇది గుణపాఠం. పాకిస్తాన్ వైఖరిని ఇతర దేశాలు సైతం నిరసిస్తున్నాయి. ఊరీలో మన సైనిక స్థావరంపై దాడి జరిపిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు తాజా ‘మెరుపుదాడి’ గుణపాఠం వంటిది. ఇన్నాళ్లూ భారత్ ప్రదర్శిస్తున్న సహనాన్ని పాకిస్తాన్ మన చేతగాని తనంగా జమకట్టి ఉగ్రవాదులను రెచ్చగొట్టి మన దేశంలో కల్లోలం సృష్టిస్తోందన్న సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇకనైనా అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేసేందుకు ఇతర దేశాలు సహకరించాలి. ఉగ్రవాదం వల్ల ఇన్నాళ్లూ తాము ఏం సాధించామన్న విషయాన్ని పాక్ నేతలు ప్రశ్నించుకోవాలి. భారత్‌ను తక్కువగా అంచనా వేయడం మానుకోవాలి. మన సైనికుల్లో ఆత్మస్థయిర్యాన్ని పెంచిన ప్రధాని మోదీకి అభినందనలు.
- టి.రమేష్, అనంతపురం