ఉత్తరాయణం

అంతు దొరకనివి లక్షల కోట్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐడీఎస్ (ఆదాయ బహిర్గత పథకం) ద్వారా అరవై వేల మంది తమ అప్రకటిత ఆదాయాన్ని, ఆస్తుల్ని నలభై ఐదు శాతం పన్ను కట్టి చట్టబద్ధం చేసుకోగా, ప్రభుత్వ ఖజానాకు ముప్ఫైవేల కోట్లరూపాయల మేరకు జమ కావడం అభినందనీయం. దేశంలో ఆరు లక్షల మందికి నోటీసులు జారీ కాగా, ముందుకు వచ్చినవాళ్ళు అరవై వేల మంది మాత్రమే కావడం నిరాశాజనకం. దేశ స్థూల జాతీయోత్పత్తికి రెండింతలుగా నల్లధనం ప్రవహిస్తున్న దేశంలో చేయాల్సిన సంస్కరణలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఇటువంటి స్వచ్ఛంద ప్రకటనా పథకాల ఉపయోగం, పరిధి స్వల్పం. దొంగతనాల్ని అదుపు చేయలేక, దొంగల నుండి వాటా తీసుకొని, దోపిడీని చట్టబద్ధం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో- ఇలాంటి పథకాల ద్వారా అంతే ఫలితం. తద్వారా పోగయ్యే పైసలకన్నా, పోగొట్టుకునే రూపాయలే ఎక్కువ. అలా అని ప్రభుత్వం పడుతున్న శ్రమని తక్కువ చేసి చూపడం కాదు గానీ చెయ్యాల్సింది ఎంతో ఉందని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటో వివిధ అధికారిక కమిషన్లు సాధికారికంగా చెప్పాయి. నల్లధనం అభివృద్ధికి తల్లివేరైన రాజకీయాల్లో, ఎన్నికల్లో సంస్కరణలు దగ్గర నుండి ఐదు వందలు, ఆపైన పెద్ద కరెన్సీ నోట్ల రద్దువరకూ వివిధ మార్గాల్ని సూచించాయి. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించడానికి ఆ దేశాలతో ఒప్పందాలు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తే, భారత్ సంపన్న దేశం కావడం చిటికెలో పని. ఆర్థిక తీవ్రవాదంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
డిగ్రీలున్నా పిలవరు..
అటెండర్, స్వీపర్ లాంటి నాల్గవ తరగతి ఉద్యోగాలకు సైతం ఇంజినీరింగు చదివినవారు ఎగబడటం చూసి సరస్వతిని లక్ష్మిగా మార్చేశారంటూ ఇటీవల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రస్తుత విద్యావిధానాన్ని తప్పుపట్టారు. నిజానికి సరస్వతిని లక్ష్మికి అమ్మేశారు. దీనికి ఒక ముఖ్యకారణం- ఫీజు వాపసు పథకాన్ని సొమ్ముచేసుకోడానికి పలుకుబడి ఉన్నవాళ్లు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించడం, ముందువెనకలు ఆలోచించకుండా ఆ కాలేజీల్లో విద్యార్థులు చేరడం.! వారికి డిగ్రీలొచ్చాయి కానీ, కొన్ని కాలేజీల పేర్లు చూసి ఎవరూ ఇంటర్వ్యూకి కూడా పిలవటం లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఎంత చిన్నదైనా అందరూ ఎగబడటానికి మరో కారణం- అక్కడ అంతగా పని చేయనక్కరలేదు. పై రాబడి బాగానే ఉంటుంది. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే ఎవరూ తీయలేరన్న భావనకు ప్రజలూ బాధ్యులే.
- ప్రభాస్, కాకినాడ
వెంటాడుతున్న ముంపు భయం
కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో అన్నారం బ్యారేజీ, పంపుహౌస్ నిర్మాణం సందర్భంగా గోదావరి నదీ తీరాన పలు గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు అంటున్నారు. అయితే, ఏయే గ్రామాలకు కచ్చితంగా ముంపు సమస్య ఉందో అధికారులు గానీ, పాలకులు గానీ సరైన లెక్కలు చెప్పడం లేదు. ముంపు బారినపడే పంటపొలాలు, గ్రామాల గురించి వాస్తవాలు తెలియనందున ఈ ప్రాంత వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. దామెరకుంట, గుండ్రాల్‌పల్లి, గంగాపురి, చింతలపల్లి తదితర గ్రామాల ప్రజలు, రైతులు ఇపుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ముంపు గురించి వివరాలు తెలి యజేయాలని వీరు అడుగుతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ముంపు సమస్య గురించి వాస్తవ గణాంకాలు చెప్పి ప్రజల్లో గందరగోళాన్ని తొలగించేందుకు పాలకులు చొరవ చూపాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్లు, భూములు కోల్పోయే వారికి న్యాయబద్ధంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది.
- సింగు లక్ష్మీనారాయణ, దామెరకుంట