ఉత్తరాయణం

వీరికీ రెండేళ్లు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపి సర్కారు ప్రభుత్వోద్యోగుల పదవీ కాలాన్ని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది. దీనిని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లకు వర్తింపచేసింది. పదవీ విరమణకు పెంచిన గరిష్ట వయో పరిమితి విషయంలో నాల్గవ తరగతి ఉద్యోగులకు ఓ రకంగా అన్యాయం జరిగిందనే చెప్పాలి. గత ప్రభుత్వాల కాలంలో ప్యూన్లు, అటెండెంట్లు, గార్డెనర్లు, స్కావెంజర్లు తదితరులకు రిటైర్‌మెంటు వయసు 60 ఏళ్ళుగా వుండేది. పైస్థాయి ఉద్యోగులకు రిటైర్‌మెంటు వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ళకు పెంచినపుడు నాల్గవ తరగతి ఉద్యోగులకు 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పొడిగించడం న్యాయ సమ్మతం. అంతకాలం పనిచేయలేమని అనుకొన్నవారికి వెసులుబాటు కల్పించవొచ్చు. ఇది సర్వజన సమ్మతము.
- బండి సత్యవతి, అత్తిలి
ప్రతి కుటుంబానికీ ఉద్యోగం..
అందరికీ ఉపాధి దొరకాలంటే ప్రభుత్వ ఉద్యోగాలను ఇంటికి ఒక్కరికే పరిమితం చేయాలి. భార్యకుంటే ఉద్యోగం ఉంటే భర్తకు ఇవ్వద్దు. భర్త ఉద్యోగం చేస్తే భార్యకు ఇవ్వరాదు. కుటుంబాల ఆర్థిక పరిస్థితులను చూసి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక చేయాలి. సంపన్న వర్గాలకు చెందిన వారిలో కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగం లేకున్నా ఇబ్బంది లేదు. వీరు ప్రైవేటురంగంలోనైనా ఉద్యోగాలు సంపాదించుకోగలరు. ప్రభుత్వ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాలను కూడా ఆర్థిక స్థోమతను చూసి భర్తీ చేయాలి. స్వచ్ఛందంగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినవారికి ప్రోత్సాహకాలను అందజేయాలి. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం దక్కేలా ప్రభుత్వం తగిన విధానాలను రూపొందించాలి.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్
మారని పాక్ వైఖరి
పాకిస్తాన్ సినీనటులు ఉగ్రవాదులు కాదని బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ అన్నాడు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న విషయం జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో దౌత్య, రాజకీయ, కళారంగాల్లో పాక్‌పై నిషేధం విధించడం అవసరం. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకువెళ్ళి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి భారత్ సైనికులు అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. అన్ని రాజకీయ పక్షాలూ మన సైన్యం జరిపిన మెరుపుదాడిని మెచ్చుకున్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ పాలకుల వైఖరిలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ అక్రమ చొరబాట్లకు, దాడులకు పాక్ ప్రేరిత ఉగ్రవాదులు తెగబడుతున్నారు. పాక్ సైనికులు కూడా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈ తరుణంలో పాక్ సినిమాలను, ఆ దేశానికి చెందిన నటులను భారతీయులు ఆదరించగలరా? పాక్ దాడులను ఆ నటులు ఎవరైనా ఖండించగలరా?
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
మృత్యు రహదారి
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు నేషనల్ హైవేపై నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఎందరో ప్రాణాలు కోల్పోతుండడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. మితిమీరిన వేగంతో కొందరు వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతున్నందున ప్రమాదాలు అనివార్యమవుతున్నాయి. హైవే పొడవునా మద్యం షాపులతోపాటు దాబాలు, హోటళ్లలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నందున డ్రైవర్లు పట్టపగలే అదుపులేకుండా ప్రవర్తిస్తున్నారు. మరోవైపు పల్లెలకు తిరిగే ఆటోలు, జీపులు ఓవర్‌లోడ్‌తోపాటు రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం నిత్యకృత్యమైపోయింది. నిబంధనలను ఉల్లంఘించి వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
నరకం చూపిస్తున్న రోడ్లు
నల్గొండ పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల గుంతలు పడ్డాయి. తాత్కాలిక చర్యల్లో భాగంగా మున్సిపాలిటీ యంత్రాంగం గుంతలు పూడ్చడానికి చర్యలు చేపట్టింది. గుంతలలో మట్టిపోసిన కారణంగా దుమ్ము పైకిలేచి వాహన చోదకులకు, పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఇప్పటికీ పూడ్చని గుంతల వలన రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. కాల్వలు, నాలాలు, వర్షపు నీరు ప్రవహించే ప్రాంతాలలో అక్రమ కట్టడాలను తక్షణం తొలగించాలి. దోమల వ్యాప్తి నిరోధించేందుకు కాల్వలు శుభ్రం చేయడం, ఫాగింగ్ వంటి చర్యలకు ఉపక్రమించాలి.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
పాక్ ఆగడాలను ఖండించరా?
మన దేశంలో చాలామంది విచిత్ర ఉదారవాదులున్నారు. వీరికి సాటి భారతీయులు ఎదుర్కొంటున్న అవమానాలు, ఛీత్కారాలు, హత్యలు పట్టవు. పొరుగు దేశం వాడికో, పరాయి మతం వాడికో చిన్న సమస్య వస్తేచాలు వారికి వత్తాసు పలుకుతారు.