ఉత్తరాయణం

షిరిడీ సాయిభక్తులు హిందువులు కారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ మతాన్ని బౌద్ధ మతం కబళించే స్థితిలో ఆదిశంకరాచార్యుల వారు ఉద్భవించి, ఆ మతాన్ని భారతదేశం నుండి తరిమికొట్టి మళ్లీ అది ప్రవేశించకుండా నాలుగు దిక్కులా పీఠాలను స్థాపించారు. బౌద్ధ మతానికి వేదాలతో పనిలేదని ఆయన భావించారు. ఈ కారణంగానే హిందూ మతం సుస్థిరంగా ఉండాలని పీఠాలను స్థాపించి భారతీయులను సమైక్యపరిచారు. ‘వేదం వేరు, హిందూ మతం వేరు’ అనడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలులేదు. పరమ పవిత్రమైన వేదాలను ఈ సృష్టి ప్రారంభంలోనే భగవంతుడు ప్రసాదించాడు. ఇవి ఎవరూ వ్రాసినవి కావు. కాగా, షిరిడీ సాయిబాబాను ఒక అవధూతగా కాకుండా.. ఒక దేవతామూర్తిగా పూజించే వారికి కూడా వేదాలతో ఎలాంటి పనిలేదు. షిరిడీ సహా ఏ ప్రాంతంలోని సాయి మందిరాల్లోనూ ఎపుడూ వేదాలను పఠించరు. షిరిడీ సాయి గుడుల్లో ధార్మిక కార్యక్రమాలేవీ వేదయుక్తంగా జరగవనేది జగమెరిగిన సత్యం. హోటల్‌లో తయారైన ఇడ్లీలు, మిఠాయిలను సాయికి ప్రసాదంగా నివేదిస్తారు. సాయిబాబాను శివస్వరూపుడిగా భావిస్తే- శివాలయాల్లో జరిగే పద్ధతుల్లో అంటే.. మహాన్యాస, నమక, చమకాలతో ఎందుకు అభిషేకం చేయరు? షిరిడీలో వేద పాఠశాల, గోశాల వంటివి ఉన్నాయా?
వేదాన్ని నమ్మినవారు మాత్రమే హిందువులు. వేదాలతో సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్న షిరిడీ సాయి భక్తులు తాము ‘హిందువులం కాద’నే విషయాన్ని ఇకనైనా గుర్తించాలి. వారిది నిజానికి ‘షిరిడీ మతం’. తాము హిందువులం కాదని సాయిభక్తులు కూడా ధైర్యంగా ప్రకటించాలి. సాయిబాబాను ఆరాధించడం అనేది వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరికీ అభ్యంతరం లేదు. అందరూ సాయిభక్తులే అయితే.. ఇక వేదాలు సున్నా.. హిందూ మతం సున్నా..
మొదటి నుంచీ వేద వ్యతిరేక భావాలు గల ఆర్య సమాజ్, బ్రహ్మసమాజ్, బ్రహ్మకుమారీస్ వంటి ‘మతాల’కు హిందూ మతం ఎంతో ఉదారంగా దారి ఇస్తూనే ఉంది. ఇపుడు ‘షిరిడీ మతం’ కూడా అటువంటిదే. దీని వల్ల హిందూ మతానికి వచ్చే నష్టం కంటే- దానికి దూరమవుతున్న వారికే నష్టం ఎక్కువ. ఈ విషయాన్ని సాయిభక్తులు గ్రహించాలి. ఆది శంకరాచార్య, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షిల వలే షిరిడీ సాయిబాబా కూడా కేవలం ఒక అవధూత మాత్రమే అని భావించే వారు మాత్రమే హిందువులు. ‘నా తల్లిదండ్రులు నాకు పూజనీయులే కానీ, వారికి గుడికట్టి పూజిస్తానం’టే భారతీయ సనాతన సంప్రదాయం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించదు. ఆది శంకరాచార్య స్థాపించిన పశ్చిమ ద్వారకా పీఠం ప్రస్తుత పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి కాక ఇంకెవ్వరూ ఈ నిజాన్ని చెప్పరు. హిందువులైతే శంకరాచార్యుల వారు చెప్పిన పలుకులను శిరసావహించాలి. స్వామీజీ హిందువులను ఉద్దేశించి మాత్రమే పలికారు, ‘షిరిడీ మతస్థుల’ కోసం కాదు. మన పూర్వీకులు ఎవరిని పూజించారో మనం కూడా వారినే పూజించి, ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాల వారికి అందించాలి. అదే సనాతన ధర్మం. హిందువులను వారికి తెలియకుండానే హిందూ మతం నుంచి దూరం చేసే దుష్ట ప్రయత్నాలను హిందువులంతా ఐక్యతతో ప్రతిఘటించాలి.
-తాడిమేటి చక్రపాణి రావు, వేదాద్రి (కృష్ణా జిల్లా)