ఉత్తరాయణం

బిజెపి ద్వంద్వ వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన సమయంలో ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బిజెపి ప్రకటన చేసి ఇపుడు ద్వంద్వవైఖరి అవలంబిస్తోంది. ప్రత్యేకహోదా అయిదేళ్లు కాదు, పదేళ్లు ఇవ్వాలన్న ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మాట మార్చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలను విమర్శిస్తున్నది. వైకాపా, కాంగ్రెస్ వారు ఎందుకు చేస్తున్నారు? ఆనాడు ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి నేతలు చెప్పడం వల్లనే గదా? బిజెపి నాయకులు హామీ ఇవ్వకుంటే ఏ గొడవా ఉండేది కాదు. చివరికి ద్వంద్వవైఖరిని ప్రదర్శించి ప్రజలను ‘కమలనాథులు’ మోసం చేశారు. ఇప్పుడు ప్యాకేజీ పేరుచెప్పి మరోసారి మోసం చేయాలని చూస్తోంది. పదవులు, అధికారం శాశ్వతం కావని వీరు తెలుసుకోవాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
వృద్ధులకు ఆసరా
అత్తమామలను కోడలు సరిగా ఆదరించకపోతే కొడుకు తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చునని సుప్రీం కోర్టు ఇటీవల ఓ కేసులో తీర్పునిచ్చింది. భార్యాభర్తలు అన్యోన్యంగా సంసారం గడుపుతూంటే మధ్యలో అత్తమామల వల్ల కలిగే మనస్పర్థల వల్ల కొడుకు తన భార్యతో తెగతెంపులు చేసుకోవచ్చుననే సూచన శుభసూచకం కాదు. దీన్ని ఆమోదిస్తే చాలా కాపురాలు వీధినపడతాయి. అలాగే- కొడుకు, కోడలు మధ్య స్వేచ్ఛకు అత్తమామలు ఆటంకం కాకూడదు. వయసుపైబడిన అత్తమామలను వదిలేసి వారు ఎక్కడికీ వెళ్ళలేరు. ఇది చిక్కు సమస్యే. మరోవైపు నిర్లక్ష్యానికి గురయ్యే వృద్ధ దంపతులను ఆదుకోవల్సిన అవసరం ఉంది. వీరికి ఆసరా కలిగించేలా కొత్త చట్టాలను రూపొందించాలి. ఇలాంటివారికి మేలుచేసే వృద్ధాశ్రమాలు ఒక విధంగా మంచివేననిపిస్తోంది. మానవతావాదులు వృద్ధులను ఆదుకునేందుకు సేవాభావంతో వృద్ధాశ్రమాలను నిర్వహించాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
సుప్రీం తీర్పు భేష్
కాంట్రాక్టు ఉద్యోగులకు, రెగ్యులర్ ఉద్యోగులకు పని ఆధారంగా ఇస్తున్న వేతనాల్లో వ్యత్యాసం ఉండరాదంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అభినందనీయం. ఈ ఆదేశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో అమలుపర్చాలి. వేతనాల విషయమై అంతర్జాతీయ న్యాయ సూత్రాల్ని ఒడంబడికల్ని ఆమోదిస్తూ, మద్దతిస్తున్న దేశంగా ఈ పనిని కేంద్ర ప్రభుత్వం ఏనాడో చేపట్టాల్సింది. సుప్రీం ఆదేశానుసారమైనా ఇకనైనా అమలుపరిస్తే సంతోషమే. ఉద్యోగం తాత్కాలికమో, శాశ్వతమో అన్న అంశంపై ఆధారపడకుండా, లింగబేధం చూపకుండా సమానమైన పనికి, సమానమైన వేతనం పొందడం ఉద్యోగి హక్కు. రాజ్యాంగ పీఠిక పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం దఖలు పడాలని సూచిస్తుంది. ప్రభుత్వమే వేతనాల్లో అసమానత్వం చూపడం రాజ్యాంగ వ్యతిరేకమే. తాత్కాలిక ఉద్యోగులకు న్యాయంగా చూస్తే రెగ్యులర్ ఉద్యోగులకన్నా కొంత ఎక్కువ జీతమే ఉండాలి. ఎందుకంటే వారికి ఉద్యోగ భద్రత, సెలవులు, భత్యాలు తదితర వెసులుబాట్లు వుండవుకనుక. అందుకు భిన్నంగా అతి తక్కువ వేతనాల్ని ఇవ్వడమంటే వారి శ్రమని నిలువుదోపిడీ చెయ్యడమే. వారి అవసరంతో, నిస్సహాయతతో వ్యాపారం చెయ్యడమే. ప్రభుత్వమే ఇలా ఆలోచిస్తే, లాభాలే ప్రాతిపదికగా ఉండే ప్రయివేట్ మార్కెట్ ఇంకెలా ఆలోచిస్తుంది. సుప్రీం కీలక తీర్పులో స్ఫూర్తిని అర్థం చేసుకొని ప్రభుత్వం వేతనాల్లో సమానత్వం పాటించడమే కాకుండా, ప్రయివేట్ రంగంలో కూడా పాటించేలా శ్రద్ధతీసుకోవాలి.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
మత మార్పిడులు ఆపండి
తెలుగు రాష్ట్రాల్లోనేగాక యావత్ భారతావనిలో మత మార్పిడులను పూర్తిగా నిషేధించకపోతే, హిందూ సమాజం అంతరించిపోయే ప్రమాదమున్నది. ప్రలోభాలతో హిందూ జాతిని మత మార్పిడులకు పురికొల్పడం సరికాదు. మతం మారితే జబ్బులు పోతాయని, బీదరికం వుండదని మాయమాటలు చెప్పి మతాన్ని మార్పిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలి. మరోవైపు తిరుపతి, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాల వద్ద అన్యమత ప్రచారం జోరుగా సాగుతోంది. స్వాతంత్య్రం అనంతరం ఏ కుటుంబం ప్రలోభాలకు లొంగి మతం మార్చుకున్నారో, అటువంటివారిని గుర్తించి ప్రభుత్వ రాయితీలన్నీ రద్దుచేయాలి. అలా కానప్పుడు ఓటు రాజకీయాలతో మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారనేది వాస్తవం కాక తప్పదు. మత మార్పిడులు చేయించే వారిని జాతి వ్యతిరేకులుగా ప్రకటించి అటువంటి వ్యక్తులను సామాజికంగా వెలివేయాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
నమ్మకం ప్రధానం
విభిన్న మతాలకు చెందిన భక్తులు వారి నమ్మకాల మేరకు దేవుళ్లను, ఇతరులను ఆరాధిస్తారు. షిరిడీ సాయిబాబా దేవుడు కాదని, హిందువులు అతడ్ని పూజించరాదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు. సాయిభక్తుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వారిని పోలీసుల చేత గెంటివేయించడం మరీ దారుణం. ఇతరులు చెప్పే విషయాలను, వాదనలను కూడా స్వామీజీలు విని, భక్తుల సందేహాలను నివృత్తి చేయాలి. అయితే, స్వరూపానంద ఏకపక్షంగా తన వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. పీఠాధిపతులైనవారు ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రసంగిస్తే ఎలాంటి వివాదాలు ఉత్పన్నం కావు. ఇతరుల మనసులను నొప్పించే విధంగా వ్యాఖ్యానాలు చేయడం పీఠాధిపతి స్థాయిలో ఉన్నవారికి తగునా? షిరిడీ సాయిబాబా హిందువైతేనేం? ముస్లిం అయితేనేం? ఎవరికైనా మతాన్ని చూసి భక్త్భివం రాదు. నమ్మకం ఉంటే ఎవరినైనా ఆరాధించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంది.
- డివి సత్యనారాయణ, అనకాపల్లి