ఉత్తరాయణం

లోపాలను సవరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్య కార్యకర్తలు, సామాజిక సంస్థల కృషి ఫలితంగా ఎట్టకేలకు హెచ్‌ఐవి, ఎయిడ్స్ నియంత్రణ ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం హర్షదాయకం. దేశంలో మొత్తమీద ఎయిడ్స్, హెచ్‌ఐవి రోగగ్రస్తులలో 55 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఈ రాష్ట్రాలలో వ్యాధిగ్రస్తుల ఉపశమనానికి తీసుకునే చర్యలు నామమాత్రంగా వున్నాయి. రోగుల పట్ల వివక్ష, నిర్లక్ష్యభావం కనబరిచే వైఖరి ఎక్కువగా వుంది. ఈ ధోరణికి అడ్డుకట్టవేసే విధంగా బిల్లును పార్లమెంట్ ముందు తీసుకువచ్చే ప్రయత్నం చేసినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. బాధిత మహిళల సమస్యలను గుర్తించి వైద్యం, సామాజిక అండదండలు, లైంగిక నేరాల బారినపడి గర్భిణులైన మహిళలకు ప్రత్యేక చికిత్స, అవాంఛిత గర్భాలకు కారకులయ్యే మగవారికి శిక్ష మొదలైన అంశాలకు సంబంధించి బిల్లులో లోపాలు వున్నాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లులోని అంశాలపై మరింత కూలంకషంగా చర్చించి, లోపాలను నివారించే విధంగా చట్టాన్ని తీసుకురావడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.
- ఎం.కనకదుర్గ, తెనాలి
విమర్శలు వద్దు
కాశ్మీర్‌ను టార్గెట్ చేసికొని పాక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుంటే, మరొకవైపు మన జవాన్ల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా, కాంగ్రెస్ కువిమర్శలకు పాల్పడ్డం వెనుక ఆంతర్యం ఏమిటి? సర్జికల్ ఆపరేషన్ విషయమై కాంగ్రెస్ నేతలు పదే పదే రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సబబు? కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం సర్జికల్ ఆపరేషన్‌పై విమర్శలే! వాస్తవితతో కాంగ్రెస్ వారు ఆలోచించాలి. జవాన్ల సాహసాన్ని రాజకీయాలకు ఉపయోగించవద్దు..
- వేదుల జనార్ధనరావు, వంకావారిగూడెం
మహిళలంతా ఒక్కటే
మతాచారాల ముసుగులో ముస్లిం మహిళల హక్కులను హరిస్తున్న ‘తలాక్’ పద్ధతిని రద్దుచేయవలసిన సమయం ఆసన్నమైంది. తనకిష్టం లేకపోతే ‘తలాక్’ అనే పదంతో ముస్లిం భర్త తన భార్యను వదలివేయటం అమానుషం. మతం కొన్ని ఆచారాలకే పరిమితమవ్వాలేగాని, జీవితాలతో ఆడుకోరాదు.