ఉత్తరాయణం

అంతం లేని అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే ప్రజలు అక్కడి ఉద్యోగులకు చేతులు తడపనిదే ఏదీ కావడం లేదు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కార్యాలయాల్లో ప్రతి పనికి ఓ రేటును నిర్ణయించి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను పీడించి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. ఎసిబి అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా అవినీతి తగ్గడం లేదు. ఇటీవలి కాలంలో ఈ అవినీతి మరీ పెచ్చుమీరింది. అవినీతికి దూరంగా ఉండాలని సాక్షాత్తూ సిఎం కెసిఆర్ అధికారులను హెచ్చరిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా పౌర సేవా పత్రాలను (సిటిజెన్ ఛార్టర్) అమలుచేస్తే అవినీతి కొంతవరకైనా తగ్గుముఖం పడుతుంది. అవినీతి రహిత పాలనను ప్రభుత్వం అందించాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
రైళ్ల సంఖ్యను పెంచండి
సికిందరాబాద్ నుంచి కర్నూలుకు రైళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రజలు మరో గత్యంతరం లేక ప్రైవేటు బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది. బస్సు ప్రయాణం సామాన్య ప్రజలకు అధిక భారాన్ని మిగుల్చుతోంది. వివిధ పనుల నిమిత్తం కర్నూలు ప్రాంత ప్రజలు హైదరాబాద్ వెళ్తుంటారు. దక్షిణ మధ్యరైల్వే వారు సికిందరాబాద్ నుంచి కర్నూలుకు రైళ్ల సంఖ్యను పెంచటానికి చర్యలు తీసుకుని, ప్రజల డబ్బు వృథా కాకుండా చూడాలి.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
సమాజసేవ వద్దంటారా?
షిరిడీ సాయిబాబా దేవుడెలా అవుతాడంటూ ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి వ్యాఖ్యానించడం సరికాదు. సత్ప్రవర్తనతో ప్రతి జీవిలో పరమాత్మను చూడగలగాలి. ఆ విధంగానే సాయిబాబాలో శివుణ్ణి, విష్ణువును చూస్తూ కొందరు అన్నదానం వంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సమాజసేవ చేస్తున్న సాయిభక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఈ చర్చ అవసరమా? సాయి సన్నిధానంలో అన్ని మతాల గుర్తులూ కనపడ్తుంటాయి. ఇందువల్ల ధర్మగ్లాని ఏం జరుగుతోందన్నది స్వరూపానంద పునరాలోచన చేయాలి. మతమార్పిడులను అరికట్టేందుకు తాను ఏమైనా చేయగలనా? అన్న విషయాన్ని స్వామి వారు ఆలోచిస్తే బాగుంటుంది.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
రోడ్లపక్కన మద్యం..
జాతీయ రహదారులపై, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలను విచ్చలవిడిగా తెరిచారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారు రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఈ ప్రమాదాల్లో ప్రతినిత్యం ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. ఈ మద్యం దుకాణాలను తొలగించకుంటే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. రహదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారి సంఖ్య ఎక్కువే. మద్యం సేవించి వాహనాలను నడిపిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు విధిగా తీసుకోవాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం