ఉత్తరాయణం

ఓటరు తీర్పుకు విలువేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని లక్షల మంది ఓట్లు వేస్తే కాని ఏ పార్టీ అభ్యర్థీ శాసనసభకు ఎన్నిక కాడు. ఎన్నికైన తర్వాత ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ తనకు లాభసాటిగా ఉన్న పార్టీలోకి వెళ్లిపోతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలో ఇటీవలి పరిణామాలు చూస్తే పార్టీ ఫిరాయింపులను అరికట్టే అధికారం ఎవరికి ఉందో అర్థం కావడం లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ నిర్ణయంలో ఇంత జాప్యం ఎందుకు? స్పీకర్ పా లక పక్షం వాడు కాబట్టి ఏ నిర్ణయం ప్రకటించకుండా ఏళ్లకొద్దీ తాత్సారం చేసినా అడిగే వారు లేరు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని ఎమ్మెల్యేలు అంటున్నారు. సామాన్య ఓటరు నిశే్చష్టుడై జరుగుతున్నది గమనిస్తూ మరో ఎన్నిక దాకా వేచి చూడడం తప్ప ఏమీ చేయలేడు.
-కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్
ఒత్తిడిని అధిగమిద్దాం
మనిషి జీవితం విలువైనది. ఆధునిక యుగంలో చాలామంది పలురకాల ఒత్తిడులకు, సంఘర్షణలకు గురవుతున్నారు. జీవితంలో ఎదగాలనే తాపత్రయం, డబ్బు సంపాదనపై మోజు ఒత్తిడికి గురిచేస్తున్నాయి. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై సైకోలుగా మారడం, పిచ్చి పట్టినట్లు వ్యవహరించడం, నరాల వ్యాధులకు గురై పక్షవాతం రావడం వంటి అవలక్షణాలు నేడు చాలామందిలో కనిపిస్తున్నాయి. ఎయిడ్స్, పోలియో, టిబి లాంటి వ్యాధులపై ప్రచారం జరుగుతున్నట్లుగానే ఒత్తిడి గురించి ప్రజలలో అవగాహన పెంచాల్సి ఉన్నది. ఒత్తిడిని తట్టుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరం. కోపం, చిరాకుకు దూరంగా ఉందాం. ఒత్తిడిని జయిద్దాం. ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగిద్దామని ప్రతిజ్ఞ చేద్దాం.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
పోస్ట్ఫాసు పెట్టండి
స్వరూప్‌నగర్ కాలనీ (ఉప్పల్)లో పోస్ట్ఫాసు లేకపోవడంతో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోస్టల్ సేవల కోసం ఈ ప్రాంతం వారు దూరాభారం వెళ్లాల్సివస్తోంది. రిటైర్డు ఉద్యోగులు, వయో వృద్ధులు అంత దూరం వెళ్లాలంటే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొరియరు సర్వీసుల వారు ఒక కవరుకు కనీసం రూ.40 వసూలు చేస్తున్నారు. ప్రతి గ్రామానికీ సేవలు అందచేయాలని, విరివిగా ఎటిఎంలు ప్రారంభించాలని పోస్టల్ శాఖ భావిస్తోంది. మా కాలనీ సమస్యలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర పోస్టల్ డైరక్టర్ జనరల్ వారు ఇకనైనా స్పందించి పోస్ట్ఫాసు ఏర్పాటు చేయాల్సిందిగా మా వినతి.
-బొడ్డుపల్లి సుబ్రహ్మణ్యశాస్ర్తీ, ఉప్పల్
ఆ నేతలను వెలివేయాలి..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘సిమి’ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ సంతోషించదగ్గ విషయం. ఉగ్రవాదులకు మద్దతిచ్చే ఏ రాజకీయ నాయకుడినైనా ఉగ్రవాది కిందనే జమకట్టాలి. విధ్వంసకారులను వెనకేసుకొచ్చే రాజకీయ పార్టీలపై, నాయకులపై చర్యలు తీసుకోవాలి. మన సైనికులు ఆక్రమిత కాశ్మీర్‌లో తీవ్రవాదులను మట్టుపెట్టినపుడు, సైనికుల చర్యలను సమర్థించకుండా, తీవ్రవాదులకు మద్దతుగా మాట్లాడిన నేతలు భారత్‌లో ఉన్నారు. ఇలాంటివారు దేశంలో ఉండేందుకు అనర్హులు. తీవ్రవాదులకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీల బాగోతాలను బయటపెట్టాలి. మతోన్మాద రాజకీయ పార్టీలను నిషేధించాలి. తీవ్రవాదులకు మద్దతిచ్చే రాజకీయవేత్తలను సామాజికంగా బహిష్కరించాలి.
-జి.శ్రీనివాసులు, అనంతపురం
కాలుష్యం కోరల్లో..
భూగోళం రానురాను కాలుష్యం కోరల్లో చిక్కుకుంటోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న వాహన కాలుష్యం, చెత్తకుప్పలను తగులబెట్టడం, ప్రతి వేడుకలోనూ బాణసంచా వినియోగం తదితర కారణాలవల్ల నానాటికీ కాలుష్యం విపరీతంగా పెరుగుతూ ఎంతోమందిని వ్యాధిగ్రస్తులను చేస్తోంది. పసిపిల్లలు పుట్టుకతోనే శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధ పడుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్కడా వ్యర్థాలను నిలువ ఉంచడం, తగులబెట్టడం లాంటివి చెయ్యకుండా చూడాలి. వాహనాల వినియోగానికి పరిమితులు విధించాలి. పట్టణాల్లో సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలి. బాణసంచా వినియోగానికి పరిమితి విధించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం