ఉత్తరాయణం

నోట్లు వెలిసిపోతే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగా విడుదల చేసిన 2వేల రూపాయల నోటు నీట్లో తడిసి రంగుమారి వెలిసిపోతే అది అసలైన నోటు అని, రంగుమారకుంటే నకిలీ నోటు అని ఆర్‌బిఐ అధికారులు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. వర్షం పడినపుడు ఎంత జాగ్రత్తగా జేబులో దాచినా నోట్లు ఎంతోకొంత తడవకుండా ఉంటాయా? పొరపాటున నీళ్లలో పడినా వెలిసిపోతాయా? పాత 500, 1000 నోట్లు ఎంత తడిసినా రంగుమారేవి కావు. ఇపుడు 2వేల నోటుతో ఎన్ని అవస్థలో..? నీట్లో తడిసి రంగుమారితే ఈ నోట్లను ఎవరు తీసుకుంటారు? వెలిసిపోయిన నోట్లను మార్చుకునేందుకు మళ్లీ బ్యాంకుల వద్ద జనం ‘క్యూ’ కట్టాలా? నల్లధనం వెలికితీత సంగతేమో గానీ, కొత్తనోట్లతో సరికొత్త సమస్యలు తప్పవని అనిపిస్తోంది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
కొత్త భవనాలు ఎందుకు?
1920లో బ్రిటిషు వారు నిర్మించిన పార్లమెంటు భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా వుంది. పార్లమెంటు సమావేశాలు ఈ భవనంలోనే నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్త భవనాన్ని దాదాపు 200కోట్లతో నిర్మించాలని యోచిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులందరూ ఆ సచివాలయానే్న వాడుకున్నారు. విభజన తరువాత ఎపి ఉద్యోగులు సచివాలయంలో భవనాలను ఖాళీచేసి విజయవాడకు వెళ్లారు. ఖాళీ అయిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం వాడుకోవచ్చుకదా! కొత్త సచివాలయం నిర్మాణం కంటే తగిన మార్పులు చేసి, పాత భవనాలను వాడుకుంటే బాగుంటుంది. ధనిక రాష్ట్రం కదా అని పాత భవనాలను కూలగొట్టి కొత్తవి కట్టడం ఇప్పుడంత అవసరమా? నిపుణుల సూచనలను పరిగణన లోనికి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం సముచిత నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.
- కెహెచ్ శివాజీరావు, హైదరాబాద్
ఆరుబయట వంటలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నప్పటికీ, చాలా బడుల్లో వంటగదులు లేక అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. కొన్నిచోట్ల వంటషెడ్లను నిర్మించినా అవి వినియోగంలోకి రాకుండా పోతున్నాయి. దీంతో బడుల్లో ఆరుబయట చెట్లకింద వంటలు వండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవిలో, వర్షాకాలంలో వంటలు చేసేందుకు సంబంధిత సిబ్బంది నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆరుబయట వంటలు చేస్తున్నందున ఆహార పదార్థాల్లో ఏవి పడతాయోనన్న ఆందోళన వేధిస్తోంది. వంట ఏజెన్సీలకు చెందిన మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలన్నా, పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండాలన్నా వంటగదులు నిర్మించాలి. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలన్న సంకల్పంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టినందున వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు వండాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం