ఉత్తరాయణం

తపాలా శాఖతో ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోస్టుద్వారా పంపిస్తున్న వార, మాసపత్రికల కవర్లపై చందాదారుని నెంబరు, చందా గడువు తేదీ వంటి వివరాలు ప్రచురించకూడదని తపాలా శాఖ నిర్ణయించడంతో చందాదారులకు కలుగుతున్న అసౌకర్యం కలుగుతోంది. రిప్లై కార్డులు ప్రస్తుతం అందుబాటులో లేవు. ప్రజలకు నష్టం కలిగించే ఇలాంటి నిర్ణయాలు సరికాదు. చందా నెంబరు, గడువుతేదీ ముద్రించటం వలన పాఠకులకు మేలు. పత్రిక యాజమాన్యంతో సంప్రదింపులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
- వరిగంజి ప్రకాశరావు, మంటాడ
తర్ఫీదు ఇవ్వకుండానే..?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలంతా ఇకపై నగదు రహిత చెల్లింపులు చేసుకోవాలని ప్రకటనలు చేస్తున్నాయి. ఇంకా కోట్లాది కుటుంబాల వారికి బ్యాంకు అకౌంట్లు లేవు. ఆర్థిక లావాదేవీలపై తగిన అవగాహన లేనివారు ఎందరో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువురాని వారి నుండి విద్యావంతుల వరకు నగదు రహిత చెల్లింపులకు కావలసిన తర్ఫీదు ఇవ్వాల్సి ఉంది. నగదు రహిత విధానాన్ని ఒక్కసారిగా పాటించాలంటే ప్రజలు ఇబ్బందుల పాలవుతారు. ఇది సాంకేతికంగా ముందుకుపోయే చర్య అయినా, అందరికీ తర్ఫీదు ఇచ్చే ప్రక్రియ వెంటనే చేపట్టాలి. అధునాతన మొబైల్స్‌ను చౌకగా ప్రతి కుటుంబానికి సరఫరా చేయాలి.
- జి.వి.రత్నాకరరావు, హన్మకొండ
గిరిజన వర్సిటీ కలేనా?
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ గత ఫిబ్రవరిలో ప్రకటించింది. 9 నెలలు దాటినా ఇది కార్యరూపం దాల్చకపోవడం విచారకరం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసింది. 2015 ఫిబ్రవరిలో కేంద్ర బృందం వర్సిటీకి అవసరమైన స్థలాలను పరిశీలించింది. కొత్తవలస మండలం రెల్లి ప్రాంతం అన్నివిధాలా అనుకూలమని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రెల్లిలో 540 ఎకరాల భూమిని గిరిజన వర్సిటీకి కేటాయించారు. తాత్కాలికంగా విజయనగరం జెఎన్‌టియులో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తామని ప్రకటించినా, ఎలాంటి పురోగతి లేదు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్సిటీని ప్రారంభించి గిరిజన విద్యార్థులకు మేలు చేయాలి.
- వాండంగ్రి కొండలరావు, పొందూరు
తలలేమో ఆకాశంలో..
నగదు రహిత చెల్లింపులపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులొచ్చాయి. నిజానికి దేశంలో ఎంతమందికి ఇంటర్నెట్‌పై పరిజ్ఞానం ఉంది? ఏదో 5 శాతం మందికి తెలిసినంత మాత్రాన ఎందుకింత ఆర్భాటం? ప్రభుత్వ కళాశాలల్లో, లైబ్రరీలలో ఇంటర్నెట్ సదుపాయం లేదన్న వాస్తవాన్ని ప్రభుత్వం గ్రహించినట్లు లేదు. పబ్లిక్ లైబ్రరీల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు.