ఉత్తరాయణం

ఇంకుడు గుంతలు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలవనరుల సంరక్షణ అన్నింటికంటే ప్రధానమైనది. ఈ కారణంగానే తెలంగాణలోని ప్రతి ఇంటివద్ద ఇంకుడు గుంత ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. వేసవి కాలంలో వీటి నిర్మాణాల అవసరం మరింత ఉంటుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇంకుతు గుంతలు కార్యరూపం ధరించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలుపరిస్తే బాగుంటుంది. గత వేసవిలో వలే ఈ ఏడాది కూడా ఎండలు మండిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు భూగర్భజలాలు నానాటికీ అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నిచోట్లా ఇంకుడు గుంతలు ఏర్పాటైతే రాగల రోజుల్లో నీటికష్టాల నుంచి బయటపడవచ్చు. కొత్తగా ఇల్లు నిర్మించుకునేవారు ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలని, ఆ తరవాతే ఇంటి నిర్మాణానికి అనుమతి లభిస్తుందని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధన విధించినా, చాలాచోట్ల ఉల్లంఘన కొనసాగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో వీటి నిర్మాణ పనులు సక్రమంగా సాగడం లేదు. ఈ సమస్యలను అధిగమించేలా తగు చర్యలను ప్రభుత్వం వేగవంతం చేయాలి.
- జి.అశోక్, గోదూర్
అన్ని చోట్లా కెమెరాలెందుకు?
నేడు చాలా షాపుల్లో, బార్లలో, విద్యాలయాల్లో ఎక్కడపడితే అక్కడ సిసి కెమెరాలు పెడుతున్నారు. వినియోగదారుడు కొనే వస్తువులు, చూసే సినిమాలు, కొనే మందులు, వస్త్రాలు చివరకు ప్రార్థనా స్థలాల్లోను సిసి కెమెరాలు పెట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. ‘రైట్ టు ప్రైవసీ’ అనేది ప్రాథమిక హక్కు. పౌరుని కదలికలను పరిశీలించడం నేరం. కొన్ని ప్రదేశాల్లో తప్ప సినిమా హాల్స్‌లో, షాపుల్లో కెమెరాలు తీసివేయాలి.
-కె.శ్రవణ్, విశాఖపట్నం
రహదారి భద్రత కీలకం
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణ కోసం ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం కింద కేంద్రం మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని సంకల్పించింది. ‘ఎకనిమిక్ కారిడార్’ పేరిట రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టు వలన 35 వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, 21వేల కిలోమీటర్ల పొడవున రహదారుల విస్తరణ 2019లోగా పూర్తి చేయాలని నిర్ణయించడం హర్షణీయం. గతంలో వాజపేయి ప్రభుత్వం తొలిసారిగా నాలుగు లేన్ జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టగా రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. రైళ్లతో పోటీగా రోడ్డు ప్రయాణాలు సాగుతున్నాయి. ఈ ప్రాజక్టు పూర్తయితే ముఖ్య నగరాలు, పట్టణాల అనుసంధానం జరిగి మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడి పారిశ్రామకాబివృద్ధి సాధ్యమవవుతుంది. భారీగా రోడ్లను నిర్మించడం మంచిదే కానీ, ప్రమాదాలు, వాహన కాలుష్యం పెరిగే అవకాశం వున్నందున రహదారి భద్రతా నిబంధనలు, ఇంధన వినియోగంలో ప్రమాణాలను పాటించాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం