ఉత్తరాయణం

అవినీతికి అంతం ఎపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతిపరులైన అధికారులను, ఉద్యోగులను ఎసిబి యంత్రాంగం పట్టుకోని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదు. దీనికి సంబంధించి రోజూ మనం మీడియాలో వార్తలు చూస్తున్నాం. వేలాదిమంది లంచగొండుల్లో ఒక్కరో ఇద్దరో దొరుకుతారు, అదీ బాధితులు ఇచ్చే సమాచారం మేరకు ఎసిబి అధికారులు ‘వల’ పన్ని పట్టుకుంటారు. లంచగొండి అధికారులు, ఉద్యోగులు జనం నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తామే తీసుకుంటున్నా- ఇతరులకు ఇందులో వాటా ఉందని చెబుతుంటారు. పైస్థాయి అధికారులకూ చేతులు తడపాల్సి ఉంటుందని పెద్ద మొత్తాలను నొక్కేస్తారు. ఒక్కసారి లంచం అనే ఈ వ్యసనానికి అధికారులు అలవాటుపడితే, దాన్ని అంత సులువుగా వదులుకోలేరు. అవినీతి అధికారులను ఎసిబి యంత్రాంగం పట్టుకున్నప్పుడు మీడియాలో వారి ఫొటోలను, ఆస్తిపాస్తులను ప్రముఖంగా ప్రచారం చేసి అందరికీ చూపించాలి. ఎసిబి కేసులను త్వరితగతిన విచారించి దోషులకు తగిన శిక్షలను వెంటనే అమలు చేయాలి.
లంచగొండి అధికారుల బాగోతంపై విస్తృత ప్రచారం చేస్తే మిగతా ఉద్యోగుల్లో కొంతైనా భయం పుడుతుంది. వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం వేయాలి. అవసరమైతే ఇందుకు చట్టాలను మార్చాలి. లంచం తీసుకున్న వారు సిగ్గుపడేలా చేయాలి. స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండులను శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం కట్టాలి. ఈ విషయమై సరికొత్త చట్టాన్ని చేసేందుకు సుప్రీం కోర్టు, ప్రధాని మోదీ నడుం బిగించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాదు, రాజకీయ వ్యవస్థలోనూ లంచాల రోగాన్ని, అవినీతి జబ్బును పూర్తిగా అరికట్టాలి. కొన్ని కీలక ప్రభుత్వ శాఖల్లో నియామకాలు, బదిలీల సందర్భంగా జరిగే అవినీతి వ్యవహారాలపై ఎసిబి అధికారులు నిఘా ఉంచాలి. ఈ శాఖలపై నిరంతర నిఘా ఉంచితే అవినీతిని ఆదిలోనే అంతం చేసేందుకు అవకాశం ఉంటుంది. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు, ముఖ్య పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు కనీసం ఆరునెలలకోసారి వారి ఆస్తిపాస్తుల వివరాలను బహిర్గతం చేయాలి.
దేశంలో పెద్దనోట్లను రద్దు చేసినంత మాత్రాన నల్లడబ్బు పూర్తిగా అదృశ్యమైందని భావించలేం. అధికారుల్లో, రాజకీయ నేతల్లో అవినీతి ఉన్నంత కాలం నల్లడబ్బు పేరుకుపోతూనే ఉంటుంది. లంచగొండి తనాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తేనే అవినీతి తగ్గుతుంది. తద్వారా నల్లడబ్బు సమస్య అంతరిస్తుంది. ఈ దిశగా ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలి.
-సి.వి.ఆర్.కృష్ణ, హైదరాబాద్

విద్యావనంలో గంజాయి!
విశాఖ నగరంలోని పలు విద్యాసంస్థల్లో యువకులు గంజాయికి బానిసలవుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడడం ఆందోళనకరం. పలు కళాశాలల్లో విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతూ ర్యాగింగ్ సమయంలో జూనియర్లకు బలవంతంగా దీన్ని అలవాటు చేస్తున్న ఘటనలు తాజాగా వెలుగు చూశాయి. విశాఖ ఏజెన్సీతో పాటు పొరుగు రాష్టమ్రైన ఒడిశాలో గంజాయిని విస్తృతంగా సాగుచేస్తున్నారు.