ఉత్తరాయణం

తీవ్రవాదం ఉచ్చులో పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరుగు పొరుగు దేశాలకు ఉగ్రవాదం ఎగుమతి చేస్తూ పబ్బం గడుపుకునే పాకిస్తాన్‌లో ఇటీవల ఉగ్రవాదం పెచ్చుపెరిగి రెండు వందలమంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోడం, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరగడం చూస్తుంటే పరులకోసం తీసిన గొయ్యిలో తానే పడి కాళ్లు విరగగొట్టుకున్న ఒక ప్రబుద్ధుడి కథ గుర్తుకురాకమానదు. పైగా తమ దేశంలోనికి ఉగ్రవాదులను పంపి అరాచకం సృష్టిస్తున్నారంటూ అంతర్జాతీయ వేదికలపై పాక్ అసత్య ప్రచారానికి పాల్పడుతున్న వైనం చూస్తుంటే టీవీలో కామెడీ షో చూస్తున్నట్లుంది. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఒక మతం వారిపై అప్రతిష్ట కలిపేందుకు పరోక్షంగా కారణభూతమైన పాకిస్తాన్, ఇప్పుడు తనపైనే విరుచుకుపడిన ఉగ్రవాదాన్ని ఎలా అరికట్టాలో, దాని మూలాలు ఎక్కడున్నాయో తెలియక నానా యాతనలు పడుతోంది. గత నెలలో అంతర్జాతీయ ఆర్థిక చర్యల టాస్క్ఫోర్స్‌కు ఉగ్రవాదులకు నిధులు అందకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని హామీ ఇచ్చిన పాక్ ఇప్పుడు జరుగుతున్న ఉగ్రవాద చర్యలకు ఏమి సమాధానం చెప్పలేక ముఖం చాటేయడం ససజ పరిణామమే!
-ఎం.కనకదుర్గ, తెనాలి
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
పార్లమెంట్‌లో వున్న సంఖ్యాబలం అనుసరించి కేంద్ర ప్రభుత్వం నానాటికీ నిరంకుశ, నియంతృత్వ పోకడలను అనుసరించడం దురదృష్టకరం. కేంద్రీకృత పోకడలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలమధ్య సమాఖ్య స్ఫూర్తిగా అనేక నిర్ణయాలు తీసుకొనడం పట్ల దేశ వ్యాప్తంగా అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం కేంద్రం వసూలు చేసే పన్నులను దామాషా పద్ధతిలో రాష్ట్రాలతో పంచుకోవాల్సి వుండగా, సెస్, సర్‌ఛార్జిలంటూ కేంఅదం అదనపు పన్నులు విధించి వాటిని తన ఖజానాలో తీసుకుంటోంది. 14వ ఫైనాన్స్ కమిషన్ పన్నులలో రాష్ట్రాలవాటా 32 నుండి 42 శాతానికి పెంచాలని చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేశారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి హేతుబద్ధత లేకుండా ఇష్టారాజ్యంగా నిధులు, ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ప్రణాళికా రంగాన్ని రద్దుచేసి, నీతి ఆయోగ్‌ను తెచ్చి కేంద్ర ప్రభుత్వానికి తోలుబొమ్మగా మార్చేశారు. వివాదాస్పదమైన పూంచ్ కమిషన్ సూచనలు, రాజ్యాంగం 355, 356 అధికరణలు, కేంద్ర దళాలను ఏ రాష్ట్రంలోనైనా మోహరించే అధికారాల బిల్లును అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది.
-సిహెచ్.సాయిఋత్విక్, నల్గొండ
40 రోజులు వేచి ఉండాలా?
పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నికలు ఫిబ్రవరి 4న జరిగాయి. కానీ ఎన్నికల ఫలితాలు మార్చి 11న గానీ తెలియవు. అంటే 40 రోజుల తరువాత గానీ ఫలితాలు ప్రకటించబడటం కుదరదు. ఈ 40 రోజులూ బ్యాలెట్ బాక్సులను అతి జాగ్రత్తగా కాపాలా కాయాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక భారం ఎక్కువగానే ఉండచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 7 విడతలలో ఎన్నికలు జరపడం అవసరం, అనివార్యం కావచ్చు. కానీ చిన్న రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్‌కు, ఓట్లు లెక్కింపునకు 40 రోజులు అవసరమా అనిపిస్తోంది. మార్చి 5, 6 తారీఖులల జరిపితే ఎక్కువ రోజులు వేచి ఉండనవసరం లేదు. ఈ విషయంలో ఎన్నికల సంఘం దృష్టి సారించడం లేదు. ప్రతిసారీ పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకూ ఎన్నికలు జరిగినపుడు ఇలాగే జరుగుతోంది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం పోలింగ్, కౌంటింగ్‌కు వ్యవధి తగ్గించేటట్లు ప్రణాళికలు రూపొందిస్తే బాగుంటుంది. అభ్యర్థుల భవితవ్యానికి ఎక్కువ కాలం వేచి ఉండనవసరం లేకుండా చూడగలరని ఆశిస్తున్నాను.
-కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్