ఉత్తరాయణం

గ్రాట్యుటీ ఇవ్వరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన తరువాత అంటే 2014 జూన్ 2వ తేదీ తరువాత రిటైరైన టీచర్లకు పదవ పిఆర్‌సికి సంబంధించిన గ్రాట్యుటీ ఇంతవరకు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో, అసలు ఇస్తారో ఇవ్వరో తెలియదు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్నామని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. అలాంటప్పుడు గ్రాట్యుటీ బకాయిలు చెల్లించాలికదా. వెంటనే ఆ పనిచేసి ప్రభుత్వ నిజాయితీని నిరూపించుకోవాలి. రిటైరైన ఉపాధ్యాయులకు సహకరించాలి.
-ఎస్.్భదేవి, నిజామాబాద్
మానసిక రోగులకు పెన్షన్ ఇవ్వాలి
వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నట్లే మానసిక వికలాంగులను కూడా ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈమధ్య మానసిక ఆరోగ్యంపై బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించడం ఆహ్వానించదగ్గ పరిణామం. మానసిక రోగులకు రాయితీలు కూడా ఇవ్వడం సహేతుకం. వారిపట్ల నిర్దయగా వ్యవహరించేవారిని కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి.
-జి.ప్రభావతి, ప్రకాశం జిల్లా
పది నాణాలు చెల్లవా?
ఈ మధ్య కాలంలో పది రూపాయల నాణాలు చెల్లవంటూ చాలామంది వ్యాపారులు తీసుకోవాడనికి వెనుకాడుతున్నారు. నిజంగా పది రూపాయల నాణాలు చెల్లుతాయా, చెల్లవో ప్రభుత్వం స్పష్టం చేయాలి. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలి. గతంలో ఐదు రూపాయల నోట్ల విషయంలోనూ ఇలాగే సందిగ్ధత నెలకొంది. ఇప్పటికీ ఈ విషయాల్లో అస్పష్టతే. పాతనోట్లు రద్దయిన తరువాత చిల్లర కోసం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పది రూపాయల నాణాలు తీసుకోము అని చెబితే ఎలా?
-జె.సుధాకర్ రావు, కాకినాడ
జీతాలు ఇవ్వండి
పీజీ కోర్సుల ఫీజులు పెంచలేదన్న సాకుతో సిబ్బందికి ప్రైవేటు విద్యాసంస్థలు జీతాలు చెల్లించడం లేదు. గట్టిగా అడిగితే ఉద్యోగం ఊడుతోంది. తక్కువ జీతాలకే అర్హత లేనివారిని ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నారు. ఉదాహరణకు ఎమ్‌బిఎ వార్షిక ఫీజు 27వేల రూపాయలు. దీనిని చాలాకాలంగా పెంచలేదు. అందువల్ల జీతాల పెంపు, చెల్లింపుపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు శ్రద్ధ చూపడం లేదు. ఈ మధ్య ఆల్‌ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏడవ పే కమిషన్ ఫీజుల పెంపుపై హైదరాబాద్ జెఎన్‌టియులో సంప్రదింపులు జరిపింది. దీనివల్ల లబ్దిపొందేది ప్రభుత్వ సంస్థలలోని అధ్యాపక సిబ్బంది మాత్రమే. ప్రైవేటు సంస్థల బోధనాసిబ్బంది పరిస్థితి ఏమిటి? ఎవరు పట్టించుకుంటారు?
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
‘జనరిక్’ చట్టం అవసరం
అనారోగ్యంబారిన పడినప్పుడు అధిక రేట్లున్న ఇంగ్లీషు మందులు కొనడం సామాన్యులకు వీలుకాదు. వీటికి బదులు చౌకగా దొరికే ‘జనరిక్’ మందుల వినియోగం అమల్లోకి తీసుకువచ్చేందుకు వీలుగా చట్టం తీసుకురావాలని ప్రధాని మోదీ ప్రకటించడం సరైన చర్య. ఒకప్పుడు వైద్యవృత్తి అన్నా, వైద్యులన్నా గౌరవం ఉండేది. ఇప్పుడంతా వ్యాపారమయం అయిపోయింది. అవసరం లేకపోయినా ఆరోగ్య పరీక్షలు చేసుకోమనడం, అనవసరంగా ఔషధాల వినియోగం కోసం వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఇదంతా డబ్బుకోసమే. అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా చౌకగా, మేలైన జనరిక్ మందులు జనసామాన్యానికి అందుబాటులోకి తీసుకువస్తే ఎంతో మేలు చేసినట్టవుతుంది.
-ఉప్పు సత్యనారాయణ, తెనాలి