తూర్పుగోదావరి

ఒరిగిపోయన బొబ్బిలి బ్రిడ్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, జూన్ 7: కడియంలో చారిత్రాత్మకమైన బొబ్బిలి బ్రిడ్జి మంగళవారం ఒరిగిపోయింది. సామర్లకోట - ధవళేశ్వరం ఈస్ట్రన్ డెల్టా కాలువపై బ్రిటీష్ హయాంలో నిర్మించిన ఈ వంతెన ఎనిమిది దశాబ్దాలపాటు సేవలందించింది. 1935లో నిర్మించిన ఈ బ్రిడ్జి కాల పరిమితి పూర్తవడంతో 2004లో అప్పటి ఆర్‌అండ్‌బి మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు రూ.కోటి 60 లక్షలతో మరో వారధి నిర్మించారు. అయితే పూర్తి ఇనుప గడ్డర్లతో ఉన్న ఈ వంతెనను చారిత్రాత్మక కట్టడంగా గుర్తించి రంగులు వేయించాలని స్థానికులు అధికారులకు పదేపదే విజ్ఞప్తులు చేసినా బ్రిడ్జి పట్ల నిర్లక్ష్యం కనబరచడంతో గడ్డర్లు తుప్పుపట్టి ఒరిగిపోయే పరిస్థితి ఏర్పడింది.
తృటిలో తప్పిన ప్రమాదం
ఈ వంతెన ఒరిగిపోయే సమయంలో వంతెనపై 400 మంది భక్తులు సహఫంక్తి భోజనాలు చేస్తున్నారు. స్థానిక హనుమాన్ ఆలయం వద్ద స్వామి వారి జయంతోత్సవాలను పురస్కరించుకుని కడియం తాపీ పనివారల సంఘం ఈ వంతెనపైనే టెంట్లు వేసి, భోజనాలు ఏర్పాటు చేసింది. ఆ రద్దీకి వంతెన ఒక్కసారిగా ఒరిగిపోయింది. అయితే వంతెన ఒరిగిపోయే సమయంలో అంతా అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే పోలీసు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వంతెనపై రాకపోకలను పూర్తిగా నిషేధించారు. వంతెన పూర్తిగా ఒరిగిపోవడంతో తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒరిగిపోయిన బొబ్బిలి బ్రిడ్జి స్థానంలో మరో వంతెన నిర్మించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఇలావుండగా స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వంతెన తొలగింపు కార్యక్రమాలు వేగంగా చేపట్టాలని ఆర్‌అండ్‌బి అధికారులకు సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే గోరంట్ల ఎంపిపి మార్గాని లక్ష్మి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్నారు.