తూర్పుగోదావరి

కక్షతో విభజించారు.. కసితో అభివృద్ధి సాధిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరప, జూన్ 7: ఆనాడు ఏకపక్షంగా, కక్షతో అడ్డగోలుగా విభజించి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని, వారికి కనువిప్పు కలిగేలా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి కసిగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కాకినాడ ఎంపి, టిడిపి లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం పిలుపునిచ్చారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా సోమవారం మండల కేంద్రమైన కరప చిరంజీవి కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాటి ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఆదాయాన్ని తెలంగాణాకు, అప్పులు ఆంధ్రాకు పంచారని, అలాగే మనకు 80 శాతం అప్పులు, 20 శాతం మాత్రమే ఆస్తులు, రూ. 16 వేల కోట్ల అప్పులు మనపై రుద్ది మనల్ని నడిరోడ్డుపై నిలబెట్టారన్నారు. ఇటువంటి తరుణంలో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలూ కష్టపడుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ప్రతిపక్షాలు కుతంత్ర రాజకీయాలు చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ప్రజలే ప్రతిపక్షాలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా లబ్ధిదారులకు కాపు రుణ మంజూరు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పిల్లి సత్తిబాబు, ఎంపిపిలు గుల్లిపల్లి శ్రీనివాసరావు, పుల్లా సుధాచందు, జడ్పీటీసీలు బుంగా సింహాద్రి, సత్యవతి, వైస్ ఎంపిపి గొల్లపల్లి ధనలక్ష్మి, సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, డ్వామా పిడి నాగేశ్వరరావు, నియోజవర్గ అభివృద్ధి అధికారి, కాకినాడ సెజ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోరా జయరాజ్ పాల్గొన్నారు.