తూర్పుగోదావరి

ముద్రగడను అరెస్టు చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- సులు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను ఎక్కడా ఏవిధంగానూ అరెస్టు చేయలేదని, తుని రైలు దహనం ఘటనపై సిబిసిఐడి దర్యాప్తు చేస్తున్నదని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ అన్నారు. మంగళవారం కిర్లంపూడి పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయలేదని, సిబిసిఐడి దర్యాప్తులో భాగంగా తునిలో జరిగిన రైలు దహనం ఘటనపై ఎంక్వయిరీ జరుగుతుందన్నారు. అందులో భాగంగా వారి దర్యాప్తు పూర్తయిన తరువాత వేర్వేరు చోట్ల ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. జనవరి 31న జరిగిన ఘటనపై సిబిసిఐడి దర్యాప్తు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తయిన వెంటనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురిని, గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. ఈ అరెస్టుల అనంతరం ముద్రగడ పద్మనాభం అమలాపురంలోని పట్టణ పోలీసుస్టేషన్‌కు వచ్చి అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను అడిగి నేను తుని కేసులో అరెస్టు అవుతున్నాను.. నన్ను అరెస్టు చేయండి అంటూ అడిగారన్నారు. అయితే అమాలాపురం పోలీసుస్టేషన్‌లో వారిపై ఏవిధమైన కేసులు నమోదు కాలేదన్నారు. ఆ ఘటనకు సంబంధించి తుని టౌన్, తుని రూరల్ పోలీసుస్టేషన్లలో 657 కేసులు నమోదయ్యాయన్నారు. అవి కూడా ఇప్పుడు సిబిసిఐడి వారు ఇనె్వస్టిగేషన్ చేస్తున్నారన్నారు. వాటిలో లా ఆండ్ ఆర్డర్, సివిల్ పోలీసులు అయిన తమకు సంబంధలేదని, వాటిని తాము దర్యాప్తు చేయడంలేదని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. ఆ కేసులలో అరెస్టు చేయడానికి తమకు ఏవిధమైన అధికారం లేదన్నారు. తమ స్టేషన్‌కు వచ్చినా సరే తమ వద్ద ఏవిధమైన కేసులు లేనందున తాము అరెస్టు చేయలేమని, మీరు సిబిసిఐడికి వెళ్లి లొంగిపోవాలని చెప్పామన్నారు. వారు దానికి లేదు.. మీరు తీసుకెళ్లి సిబిసిఐడికి అప్పగించాలని చెప్పడంతో తాము పద్మనాభం కోసం వాహనం పురమాయించి రాజమండ్రిలోని సిబిసిఐడి వద్దకు తీసుకువెళ్లి రాజమండ్రిలో వాహనం ఆపి సిబిసిఐడి వారికి తాము ఫోన్‌చేసి ముద్రగడ పద్మనాభం తమ దగ్గర లొంగిపోయారు కనుక ఏమైనా కేసులలో అరెస్టు ఉంటే మీరు తీసుకువెళ్లాలని చెప్పామన్నారు. దీంతో సిబిసిఐడి వారు మాట్లాడుతూ తాము కేసులు ఇనె్వస్టిగేషన్ చేసిన తరువాత పూర్తి నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకుంటాము తప్ప ఇప్పుడు మాకు ఆయన అక్కర్లేదని చెప్పారన్నారు. అయితే ముద్రగడను అంతవరకు తీసుకువచ్చాము కనుక అదే వాహనంలో ఆయన ఇంటికి పంపించినట్టు ఎస్పీ తెలిపారు. అయితే ఆయన తన ఇంటి వద్ద వాహనం దిగకుండా కూర్చున్నారన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, ఎప్పుడూ కూడా ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయడంగానీ, కేసులు నమోదు చేయడంగానీ జరగలేదన్నారు. తాము అరెస్టు చేయలేదని, ప్రజలు ఏవిధమైన పుకార్లు నమ్మకుండా సమన్వయ్యంతో ఉండాలన్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉందన్నారు. జిల్లాలో గతంలో హింసాత్మక ఘటనలు జరిగిన దృష్ట్యా అన్నిచోట్లా పోలీసు పికెట్లు ఏర్పాటుచేసి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముద్రగడను తన సొంతం వాహనమెక్కి రావాలని కోరితే ఆయనే పోలీసు వాహనంలో ఎక్కి వస్తానన్నారు. ఆయన కోరిక మేరకు పోలీసు వాహనం ఏర్పాటు చేశామన్నారు. సిబిసిఐడి దర్యాప్తు అనంతరం ఏడుగురిని అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టులో హాజరుపరిచామన్నారు. ఎస్పీ వెంట కిర్లంపూడి ఎస్సై బివి రమణ ఉన్నారు.