తూర్పుగోదావరి

మూడు గ్రామాల్లో స్వచ్ఛంద బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, జూన్ 7: తుని ఘటనలకు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, లేకుంటే తనను కూడా అరెస్టు చేయాలని ఉద్యమించిన ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా మంగళవారం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి మూడు గ్రామాల్లో ఉదయం నుండి రాత్రి వరకు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కిర్లంపూడి గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటులచేశారు. సామర్లకోట - ప్రత్తిపాడు మధ్య మంగళవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయి రవాణా స్తంభించింది.
కాగా కిర్లంపూడిలో ఆందోళనకు దిగిన ముద్రగడతో జిల్లా అదనపు ఎస్పీ దామోదర్, ఒఎస్‌డి శివశంకర్‌రెడ్డి, పెద్దాపురం డిఎస్పీలు రాజశేఖరరావు, సుంకర మురళీమహన్ పోలీస్ వాహనంలోనే చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. తనకు మద్దతు తెలిపిన వారు దేశద్రోహులు, ఉగ్రవాదులు కాదని, అలాంటి వారిని ఎందుకు అరెస్టు చేశారని ముద్రగడ ప్రశ్నించారు. వారు నిజంగా ముద్దాయిలని తేలితే తానే స్వయంగా వారిని పోలీసులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే తనను, తన అనుచరులను అరెస్టు చేసి, జైలుకు పంపించాలన్నారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టంచేశారు. ముద్రగడతోపాటుగా కాపు ఉద్యమ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వాసిరెడ్డి ఏసుదాసు, కల్వకొలను తాతాజీ తదితరులు పోలీస్ వ్యాన్‌లోనే ఉన్నారు.