తూర్పుగోదావరి

కొబ్బరి అంతర్ పంటల్లో ఆంధ్రాదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, జూన్ 9: కొబ్బరి అంతర పంటల్లో ఆంధ్రాదే అగ్రస్థానమని సెంట్రల్ ప్లాంటేషన్ రీసెర్చ్ ఇనె్వష్టిగేషన్ డైరెక్టర్ డాక్టర్ చౌడప్ప అన్నారు. సిసిఆర్‌ఐ పరిశోథనా కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం కేంద్ర బృందం గురువారం కడియం వచ్చింది. పలు ప్రభుత్వ భూములను ఈ బృందం పరిశీలించింది. కొబ్బరి ఉత్పత్తిలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. సిటిఆర్‌ఐ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కొబ్బరితో చాక్లెట్లు తయారీ, చక్కెర తయారీ, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నీళ్లు వంటి ఆహార పానీయాలు తీయవచ్చునని, వాటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండు ఉందన్నారు. రాష్ట్రంలో కొబ్బరి ఉత్పత్తికి కల్పవృక్షమైన కోనసీమ ప్రాంతంలో వీటి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. అందుకు కేర్బరీ సంస్థ సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. సిటిఐఆర్ పరిశోథనా కేంద్రం ఏర్పాటుకు 30 ఎకరాలు అవసరమవుతుందని, అందుకు అనుకూలమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తోందని చౌడప్ప తెలిపారు. ఈయన వెంట ఉద్యానవన శాఖ అధికారి మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ వి నిర్వాల, కేడ్బరీ సంస్థ డైరెక్టర్ శివకుమార్, తహసీల్దార్ పిల్లా రామోజీ, సర్వేయర్ వెంకటేశ్వరరావు, విఆర్వోలు ఉన్నారు.