తూర్పుగోదావరి

మీడియాపై ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, జూన్ 9: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో చేపట్టిన ఆమరణ దీక్షకు సంబంధించిన సమాచారం సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీక్షను మొదలుపెట్టే సమయంలో మీడియాతో ముద్రగడ మాట్లాడుచున్నారని, లోపలికి వెళ్ళాలని చెప్పినప్పటికీ పోలీసులు అనుమతించలేదన్నారు. ముద్రగడ ఇంటి ముందు పోలీసులు ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌లో కూర్చోవాలని సెలవిచ్చారు. అప్పటికే కొంతమంది ముద్రగడ నివాసంలోకి వెళ్లడంతో కొంతమందిని పంపించి, మరికొంతమందిని నిలువరించడంపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకోకు దిగారు. దీనితో పోలీసులు మీడియా ప్రతినిధులను లోపలికి పంపించారు. ముద్రగడ దీక్ష మొదలైన తర్వాత కొంతమంది దీక్ష జరుగుతున్న హాలులో ఉండగా, మరికొంతమంది బయటకు వచ్చారు. అరెస్టుకు సిద్ధపడిన పోలీసులను మీడియా చుట్టముట్టి ఫొటోలు తీయడం, ముద్రగడ పురుగులమందు డబ్బాతో హెచ్చరికలు చేయడంతో ప్రసార మాధ్యమాలలో ప్రసారమైనది. దీనితో ముందుగా మీడియాను దీక్షా శిబిరానికి దూరం చేయడంపై పోలీసులు దృష్టిని పెట్టారు. ముద్రగడ ఇంటి ఆవరణలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ వెహికల్స్ వైర్లు కట్ చేశారు. వాహనాలను బయటకు పంపించారు. లైవ్ కిట్లు లోపల ఉండకూడదని శాసించారు. ఆవరణలో ఉన్నవారిలో మీడియా వారిని బయటకు పంపించారు. మీడియా పాయింట్‌లో ఉండమన్నారు.