తూర్పుగోదావరి

జిల్లాలో నెలఖారు వరకు సెక్షన్ 144, 30 యాక్టు అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గంపేట, జూన్ 9: జిల్లాలో ఈ నెలాఖరు వరకు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సెక్షన్ 144, 30 యాక్టు అమలులో ఉందని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ అన్నారు. జనవరి 31న జరిగిన తుని రైలు దహనం ఘటనలో సిబిసిఐడి 67 కేసులు నమోదు చేసిందని, దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం ఏడుగురిని సిబిసిఐడి వారు అదుపులోకి తీసుకుని కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారన్నారు. దీంతో ముద్రగడ పద్మనాభం వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేసి దోషులను విడుదల చేయాలని, లేనిపక్షంలో తాను గురువారం ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని చెప్పి ముద్రగడ గురువారం ఉదయం 9గంటల సమయంలో కిర్లంపూడిలోని తన స్వగృహంలో ఒక గదిలోకి వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. అయితే తాము జిల్లాలో 144 సెక్షన్, 30 యాక్టు అమలులో ఉన్నదని ప్రచారం చేసినా ముద్రగడ చట్టాన్ని వ్యతిరేకించి ఆమరణ నిరాహార దీక్ష చేశారని, ఈ దీక్షకు వారి కార్యకర్తలతో నిరసన తెలపడం చట్ట విరుద్ధమన్నారు. తొలుత ముద్రగడను దీక్ష విరమించాలని తాము కోరామని ఎస్పీ తెలిపారు. అయితే తుని ఘటనలో పెట్టిన కేసులన్నీ ఎత్తివేసి ఇటీవల సిబిసిఐడి అదుపులోనికి తీసుకుని ఏడుగురిని తక్షణం విడుదల చేయాలని సమాధానం చెప్పారన్నారు. అయితే ముద్రగడను అరెస్టు చేస్తామని, అరెస్టు కావాలని కోరామని, అయితే తనను అరెస్టు చేయాలంటే అరెస్టు వారెంట్ కావాలని అడిగారన్నారు. అదేవిధంగా సిబిసిఐడి కేసులకు సంబంధించి ఛార్టిషీట్లు తీసుకువచ్చి తనకు చూపించాలని ముద్రగడ అడిగారన్నారు. అయితే వెంటనే తాము సిబిసిఐడి వారికి సమాచారం ఇచ్చి వారిని కూడా కేసులకు సంబంధించి సిడి, ఫైల్స్‌తో హాజరు కావాలని కోరితే వారు ముద్రగడ ఇంటికి వచ్చి ముద్రగడకు సిబిసిఐడి సిడి ఫైల్స్ చూపించారన్నారు. అయితే కేసుకు సంబంధించి కేవలం రెండు ఛార్జిషీట్లు మాత్రమే తీసుకువచ్చారని, మిగిలినవి తీసుకురాలేదన్నారు. సిబిసిఐడి కేసుకు సంబంధించి ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క ఇన్‌స్పెక్టర్ దర్యాప్తు చేస్తారని, దీనిలో భాగంగా ఇద్దరు అందుబాటులో ఉంటే వారిద్దరితోపాటు సిబిసిఐడి అడిషనల్ ఎస్పీ హాజరయ్యారని ఎస్పీ వివరించారు. జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. భారీగా పోలీసులు బలగాలు మోహరించి ఎక్కడికక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించి శాంతి భద్రతల అదుపునకు సహకరించాలని ఎస్పీ కోరారు. ముద్రగడ దీక్షపై పోలీసులు పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటారన్నారు. ఆయన వెంట రాజమండ్రి మహిళా పోలీసుస్టేషన్ డిఎస్పీ పి భరత్‌మాతాజీ, సిఐ రాంబాబు తదితరులున్నారు.