తూర్పుగోదావరి

ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 9: జిల్లా అధికారులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఇష్టారాజ్యంగా ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని అధికార, ప్రతిపక్షానికి చెందిన పలువురు ప్రతినిధులు ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు ఈ విషయంపై ఉన్నతాధికారులు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా పరిషత్ సాధారణ సమావేశం స్ధానిక జడ్పి సమావేశ మందిరంలో జడ్పి ఛైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముందుగా వ్యవసాయ శాఖపై చర్చను ప్రారంభించారు. చర్చ జరుగుతుండగా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతంలో జన్మభూమి సభను అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జితో నిర్వహించారని ఇదేనా ప్రొటోకాల్ పాటించటం అంటూ ధ్వజమెత్తారు. ప్రొటోకాల్ అమలు చేస్తున్నామంటూ చెబుతున్న కలెక్టర్ వివరణ ఇవ్లాని పట్టుపట్టారు. అలాగే కోనసీమ ఉత్సవాల్లో తన పేరును 7వ నెంబరుగా ప్రకటించారని జిల్లా ఎమ్మెల్యేలల్లో మాత్రం వారి పేరును రెండో నెంబరుగా వేస్తున్నారన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని ఇంతవరకు ఈ సంఘటనపై బదుల్విలేదన్నారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం కలెక్టర్ తీరుపై ధ్వజమెత్తారు. తనను అవమానపరిచే విధంగా కలెక్టర్ తీరుందన్నారు. కలెక్టర్ ఛాంబర్‌కు వెళ్ళినప్పుడు కనీసం కూర్చోమని అనకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సంఘటనపై మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కలుగజేసుకుని ఇది అనవసరమైన వాదనని విలువైన సమయం వృధా చేయవద్దంటూ చెప్పడంతో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, వేగుళ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను కలెక్టర్‌ను అడుగుతున్నానని మధ్యలో మీ సమాధానం ఏంటని వేగుళ్ళను సుబ్రహ్మణ్యంను ప్రశ్నించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, చిర్ల జగ్గిరెడ్డిలు ఆరోపించారు. దీనిపై సమాధానం ఇవ్వాలని పట్టుపట్టారు. దీనిపై కలెక్టర్ బదులిస్తూ రైతులకు నగదును బ్యాంకుల ద్వారా చెల్లించామని చెప్పారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేయించేందుకు విచారణ కమిటీని నియమించాలని ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డిలు అడిగినా దానిపై మాత్రం స్పందించలేదు. ఏజన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, రేషన్ సరుకులు అందటం లేదని ఎమ్మెల్యే వంతల పేర్కొన్నారు. త్వరలోనే విద్యాశాఖలో ఉపాధ్యాయులను నియమించామని డిఇఓ బదులిచ్చారు. అనంతరం వివిధ శాఖలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపి తోట నరసింహం, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల బుచ్చిబాబు, పులవర్తి నారాయణమూర్తి, వరుపుల సుబ్బారావు, జిల్లా గ్రంధాలయ సంస్ధ ఛైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, జడ్పి సిఇఓ కె పద్మ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.