తూర్పుగోదావరి

కోనసీమలో బంద్ పాక్షికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 10: ముద్రగడ దీక్ష భగ్నం కారణంగా టిబికె జెఎసి ఇచ్చిన పిలుపుమేరకు కోనసీమలో బంద్ పాక్షికంగా జరిగింది. శుక్రవారం ఉదయం కొద్దిగా బంద్ ప్రభావం కనిపించినా అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు యధావిధిగా సాగాయి. బస్సులు, ఆటోలు యధావిధిగా తిరిగాయి. అయితే ముమ్మిడివరం, కొత్తపేట, పి గన్నవరం మండలాల్లో బంద్ ప్రభావం కనిపించింది. అమలాపురంలో బంద్ పాక్షికంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేశాయి. ఆర్టీసీ బస్సులను నడిపారు. అయితే అమలాపురం పట్టణంలో కొంతమంది తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించగా మరికొంతమంది తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించుకున్నారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడే భారీగా పోలీసులను మోహరించి వ్యాపారులంతా తమ కార్యకలాపాలను యధావిధిగా నిర్వహించుకోవాలని, తాము రక్షణ కల్పిస్తామని విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. కాగా టిబికె జెఎసి కన్వీనర్ కల్వకొలను తాతాజీ, దివంగత నల్లా సూర్యచంద్రరావు ఇళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. తాతాజీ ఇంటి వద్ద మహిళలు దీక్షలు చేపట్టి మధ్యాహ్నం ఖాళీ కంచాలు, గ్లాసులతో నిరసన తెలిపారు. ముద్రగడ దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ మామిడికుదురు మండలం నగరంలో వానరాశి ప్రసాద్, గిడుగు సురేష్‌లు సెల్ టవర్ ఎక్కి కొద్దిసేపు హల్‌చల్ సృష్టించారు. పి గన్నవరంలో టిబికె అధ్యక్షుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే అల్లర్లు సృష్టించే అవకాశాలు ఉన్న కారణంతో అమలాపురం పట్టణానికి చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అమలాపురం పట్టంలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులను మోహరింపజేసి పికెట్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ స్పష్టం చేశారు.