తూర్పుగోదావరి

చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, జూన్ 10: సామాన్య ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా చట్టాలను అతిక్రమించి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపథ్యంలో కోనసీమ బంద్‌కు కాపు సంఘాలు పిలుపునిచ్చిన సందర్భంగా ఎస్పీ రవిప్రకాష్ శుక్రవారం కోనసీమలో పర్యటించి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో సెక్షన్ 30తో పాటు సెక్షన్ 144 నెలాఖరు వరకూ అమలులో ఉందన్నారు. ఈ కారణంగా సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. జిల్లాలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సామాన్య ప్రజలకు ఆటంకం కలిగేలా ఎవరూ ప్రవర్తించవద్దని ఆయన సూచించారు. ఆ విధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలోని పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే 124 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక బలగాలను జిల్లాలో మోహరించినట్టు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు.