జాతీయ వార్తలు

ఈపిఎఫ్ వడ్డీపైనే పన్ను?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఈపిఎఫ్ విత్‌డ్రా చేసుకున్నప్పుడు అందులో 60శాతం మొత్తంపై పన్ను విధించాలన్న బడ్జెట్ ప్రతిపాదనలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దాదాపు 6.5 కోట్లమందిపై ప్రభావం పడే ఈ నిర్ణయం పట్ల ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని మొత్తానికి బుట్టలో పడేయకపోవచ్చుకానీ కొన్ని మినహాయింపులు ఇవ్వొచ్చని తెలుస్తోంది. కేవలం ఈపిఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకున్నప్పుడు వచ్చిన వడ్డీపై మాత్రమే పన్ను విధించాలన్న సూచన ఒకటి వచ్చింది. దీనిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకోనున్నారని పిటిఐ కథనం చెబుతోంది.