జాతీయ వార్తలు

రాహుల్‌కు ‘ఎథిక్స్’ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ పౌరసత్వం ఆరోపణలపై వివరణ కోరిన కమిటీ
న్యూఢిల్లీ, మార్చి 14: బ్రిటన్ పౌరసత్వం ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్లమెంటు ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. రాహుల్ బ్రిటన్ పౌరసత్వంపై బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్‌పై వచ్చిన ఆరోపణలపై తగిన విచారణ జరపించాలని బిజెపి సభ్యుడు మహేశ్ గిర్రి చేసిన విజ్ఞప్తి మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ అంశాన్ని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ అధ్యక్షతన గల ఎథిక్స్ కమిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఓ కంపెనీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి తాను బ్రిటన్ పౌరుడిని అంటూ రాహుల్ ధ్రువీకరణ పత్రం ఇచ్చారన్నది అభియోగం. కాగా ఎథిక్స్ కమిటీ నోటీసులపై రాహుల్‌గాంధీ ఘాటుగానే స్పందించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఆయన నోటీసుకు సరైన సమాధానం చెబుతామని ప్రకటించారు. ‘బ్రిటన్ పౌర సత్వంపై వివరణ కోరుతూ రాహుల్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చాం. ఆయన డైరెక్టర్‌గా ఉన్న ఓ కంపెనీకి సంబంధించి ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి’ అని ఎథిక్స్ కమిటీ సభ్యుడు అర్జున్ రామ్ మెఘవాల్ వెల్లడించారు. కాగా అన్ని రంగాల్లోనూ విఫలమైన ఎన్‌డిఏ ప్రభుత్వం విమర్శల నుంచి తప్పించుకోవడానికి షోకాజ్ నోటీసును ఎత్తుకుండదని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు. ఇది పార్లమెంటును తప్పుదోవపట్టించడమేనని విమర్శించారు. రాహుల్ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ నోటీసుకు విలువలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఎథిక్స్ కమిటీ నోటీసును రద్దుచేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.