మెదక్

కర్షకుడిపై కరుణ చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి , డిసెంబర్ 8: వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వివిధ రాజకీయ పార్టీల వ్యవసాయ అనుంబంధ సంఘాల నేతలు కరువుపర్యటన బృందానికి కలిసి వినతి పత్రాలను అందజేశారు. మంగళవారం సాయంత్రం జిల్లాలో పర్యటించిన బృందం సభ్యులు కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, రైతుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల దాహర్తి, పంట నష్టపోయిన రైంతాగాన్ని ఆదుకునేందుకు 10.94కోట్ల రూపాయలు కేటాయించాలని కమిటి సభ్యులను కోరారు. జిల్లాలో 800 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం కురువాల్సి ఉండగా కేవలం 462.4 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైందన్నారు. వరుసగా రెండేళ్లుగా జిల్లా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుందని తెలిపారు. చెరువులు కుంటలు, బోరు బావుల్లో భూగర్భ జలాలు 20మీటర్ల లోతుకు పడిపోయాయన్నారు. ఖరీఫ్ ప్రధాన పంటలైన పత్తి, మొక్కజొన్న, పెసర, సోయాబిన్, కంది పంటలు పూర్తిగా ఎండిపోయాయని భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు నర్సింహారెడ్డి సభ్యులకు వినతి పత్రాన్ని అందజేశారు. బోరు బావుల కింద వేసిన వరి, చెరువు, అరటి, కూరగాయలు వివిధ పంటలు భూగర్భ జలాలు అడుగంటడంతో దిగుబడి 25శాతానికే పరిమితమైందన్నారు. నష్టపోయిన రైతాంగానికి పెట్టుబడి రాయితీ నష్టపరిహారం అన్ని పంటలకు అందించాలని, బింధుసేద్యాన్ని ప్రోత్సహించాలని, పెట్టుబడి, సగం లాభం కలుపుకొని ధర నిర్ణయించాలని కోరారు. కమిటి సభ్యులు మహారాజ్‌కుమార్, శర్మ, ఓం కిషోర్, దినకర్‌బాబు, కలెక్టర్ రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు.
రైతు రక్షణ సమితి వినతి
రైతు బ్యాంకు రుణాలను వెంటనే రీషెడ్యూల్డ్ చేయాలని, పాత రుణాలను కనీసం 3సంవత్సరాల మారిటోరియం విధించాలని కోరారు. ఈ యేడాది కాలంలో 150మంది రైతులు వ్యవసాయ సంక్షోభం కారణంగా మృతి చెందారన్నారు. జిల్లాలో అత్యధికంగా సాగు చేసే చెరుకు పంటకు గత మూడేళ్లుగా టన్నుకు 2600రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు 50వేల రుణాలను కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇవ్వాలని, తక్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, పెట్టుబడి నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ.15వేలకు తక్కువ కాకుండా నష్టపరిహారం చెల్లించాలని జిల్లా అధ్యక్షులు రాఘవేందర్‌రెడ్డి, రంగారెడ్డి, రాంరెడ్డిలు కోరారు.
రైతు సంఘం వినతి
జిల్లాకు కరువు సాయం కింద రూ.1500 కోట్లు కేటాయించి తక్షణమే రైంతాగానికి అందించాలని, భూపేందర్ సింగ్ హుడా కమీషన్ సిఫార్సుల ప్రకారం ఆహార పంటలకు ఎకరాకు రూ.10, వాణిజ్య పంటలకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, ఒకే దఫాలో రైతు రుణ మాఫీ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6లక్షల నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజ్, ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి కోరారు.
తెలుగుదేశం పార్టీ నేతల వినతి
వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడి గణనీయంగా తగ్గిందని, 46 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువుగా ప్రకటించిన నేపధ్యంలో నష్టపోయిన రైతులకు పూర్తిగా పరిహారం అందించాలని జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డి, యాదగిరి, విజయపాల్‌రెడ్డిలు కోరారు.
రాష్ట్ర రైతు సంఘం వినతి
కేంద్ర ప్రభుత్వ ప్రకృతి వైపరిత్యాల నిధుల నుండి ఖరీఫ్ కాలంలో పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందించాలని సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ కోరారు. వరి, ఆహార, కూరగాయల పంటలకు ఎకరాకు రూ.15వేలు, పత్తి, మిరప, చెరుకు వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.30వేలను అందించాలని కోరారు.