క్రీడాభూమి

ఫిఫా ఉపాధ్యక్షుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూరిచ్, డిసెంబర్ 3: అవినీతి, లంచగొండితనం, ముడుపులు స్వీకరించడం, నిధుల దుర్వినియోగం తదితర ఆరోపణలపై స్విట్జర్లాండ్ నిఘా విభాగం అధికారులు గురువారం ఉదయం ఇద్దరు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ( ఫిఫా) ఉపాధ్యక్షులను అరెస్టు చేశారు. వీరిలో ఒకరు జువన? ఏంజెలో నపౌట్ (పరాగ్వే)కాగా, మరొకరు అల్ఫ్రెడో హవిట్ (హోండురాస్). మరి కొంత మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ, ఫిఫా మాత్రం ఇద్దరి అరెస్టును మాత్రమే ధ్రువీకరించింది. ఈ ఏడాది మే మాసంలో అమెరికా నిఘా విభాగం సూచనలపై జ్యూరిచ్ పోలీస్‌లు 11 మంది ఫిఫా అధికారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ తదితర అభియోగాలపై వారు అరెస్టు కావడంతో, ఫిఫా అధ్యక్షుడిగా ఆరోసారి ఎన్నికైనప్పటికీ, సెప్ బ్లాటన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో బ్లాటర్, యూఫా అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీ తదితరులను ఫిఫా సస్పెండ్ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిఫా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనుండగా, తాజాగా జరిగిన అరెస్టులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రపంచ ఫుట్‌బాల్‌లో తీసుకోవాల్సిన కొన్ని కీలక నిర్ణయాలపై చర్చించేందుకు ఫిఫా అధికారులు జ్యూరిచ్‌లోని బార్ ఆ లాక్ హోటల్‌లో బస చేశారు. గురువారం తెల్లవారు జామునే అక్కడికి చేరుకున్న పోలీస్ అధికారులు హోటల్ లాబీలో ఎవరూ ఉండకూడదని, ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోవాలని సూచించారు. అనంతరం తనిఖీలు నిర్వహించి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారని హోటల్ సిబ్బంది చెప్తుండగా, ఫిఫా మాత్రం ఇద్దరు ఉపాధ్యక్షుల అరెస్టును మాత్రమే ధ్రువీకరించింది. కాగా అరెస్టయిన కొందరికి ఫిఫాతో సంబంధం లేకపోవచ్చని సమాచారం.