క్రీడాభూమి

ప్లాటినీపై కఠిన చర్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, డిసెంబర్ 12: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నుంచి సస్పెన్షన్‌కు గురైన యూఫా ఫుట్‌బాల్ అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీకి కష్టాలు తప్పేటట్టు కనిపించడం లేదు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైందని, సస్పెన్షన్‌ను దీర్ఘకాలం కొనసాగించే అవకాశాలున్నాయని ఫిఫా వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఫిఫా అధ్యక్ష స్థానానికి జరిగే ఎన్నికల్లో ప్లాటినీ పోటీ చేయకుండా నిరోధించేందుకు వీలుగా ఫిఫా స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది.

అట్లెటికో డి కోల్‌కతాపై చెన్నెయిన్ గెలుపు
పుణె, డిసెంబర్ 12: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ మొదటి లెగ్, రెండో సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాపై చెన్నెయిన్ 3-0 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ 38వ నిమిషంలో బ్రూనో పెలిసరీ, 57వ నిమిషంలో జేజె, 68వ నిమిషంలో జాన్ స్టీవెన్ మెండోజా వలెన్షియా గోల్స్ సాధించి, చెన్నెయిన్‌ను విజయపథంలో నడిపారు. వ్యూహాత్మకంగా ఆడిన చెన్నెయిన్‌కు కోల్‌కతా ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. 15న రెండో లెగ్‌లో మొదటి సెమీ ఫైనల్‌లో గోవా ఫుట్‌బాల్ క్లబ్, ఢిల్లీ డైనమోస్ జట్లు తలపడతాయి. 16న కోల్‌కతా, చెనె్నయిన్ ఢీ కొంటాయి.