క్రీడాభూమి

బ్లాటర్ మెడకు అవినీతి ఉచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూరిచ్, డిసెంబర్ 17: సస్పెన్షన్‌కు గురైన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్‌కు ఉచ్చు బిగుసుకుంటున్నది. అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్న అతనిని ఫిఫా ఇటీవలే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అతనితోపాటు సీనియర్ ఉపాధ్యక్షుడు, యూరోపియన్
ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీపైనా వేటు పడింది. ఇలావుంటే, ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరువుపోగొట్టుకున్న బ్లాటర్ గురువారం ఉదయం ఇక్కడి ఫిఫా ప్రధాన కార్యాలయానికి వచ్చాడు. మెర్సిడిజ్ కారులో వచ్చిన అతను మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించాడు. ఇంకా అధ్యక్షుడిగానే తాను కొనసాగుతున్న తీరులో కొంత సేపు కార్యాలయంలో గడిపి వెళ్లిపోయాడు. కాగా, బ్లాటర్‌కు వారసుడిగా ముద్రపడిన ప్లాటినీ కేసును ఫిఫా ఆధ్వర్యంలోని ఎథిక్స్ కమిటీ విచారిస్తున్నది. శుక్రవారం అతను ట్రిబ్యునల్ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే, తాను విచారణకు వెళ్లనని, తన తరఫున లాయర్‌ను పంపుతానని ప్లాటినీ ప్రకటించాడు. ప్లాటినీతోపాటు బ్లాటర్‌ను ప్రశ్నించాలని ట్రిబ్యునల్ నిర్ణయించినట్టు వార్తలు వెలువడ్డాయి. అమెరికా నిఘా విభాగం సూచన మేరకు ఇప్పటికే అవినీతి ఆరోపణలపై 50 బ్యాంకు ఖాతాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్తంభింప చేసింది. 2011లో ప్లాటినీకి రెండు మిలియన్ డాలర్లను ఫిఫా ఖాతా నుంచి అక్రమంగా చెల్లింపులు జరిపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్లాటర్‌పైన కూడా ఇలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. అంతకు ముందు దశాబ్దం క్రితం ఒక కాంట్రాక్టును ప్లాటినీ పూర్తి చేశాడని, దానికి సంబంధించిన చెల్లింపులే జరిగాయని బ్లాటర్ అంటున్నాడు. అయితే, అతను ఫిఫా అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ, ప్లాటినీని రేసు నుంచి తప్పించడానికి ఈ మొత్తాన్ని చెల్లించాడన్న ఆరోపణలున్నాయి. త్వరలోనే ట్రిబ్యునల్ ముందుకు హాజరుకానున్న బ్లాటర్ గురువారం ఫిఫా కార్యాలయానికి వెళ్లడం ఆసక్తిని రేపుతున్నది. ఇందులో అతని ఆంతర్యం ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఎల్ సాల్వడార్ మాజీ చీఫ్ అరెస్టు
సాన్ సాల్వడార్: ఎల్ సాల్వడార్ ఫుట్‌బాల్ మాజీ చీఫ్ రేనాల్డో వాస్క్వెజ్‌ను పోలీస్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఫిఫా ముడుపుల వ్యవహారంపై విచారణ జరుపుతున్న అమెరికా నిఘా విభాగం సూచనల మేరకే ఈ అరెస్టు జరిగిందని అంటున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు వాస్క్వెజ్ ఎలాంటి ప్రతిఘటన లేకుండా లొంగిపోయాడని స్థానిక మీడియా పేర్కొంది.