జాతీయ వార్తలు

ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి: కేశినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్న విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం సభ్యుడు కేశినేని శ్రీనివాస్ కేంద్రాన్ని కోరారు. శ్రీనివాస్ గురువారం లోక్‌సభలో 377 నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై మాట్లాడుతూ ఈ విజ్ఞప్తి చేశారు. విజయవాడతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో 1.5 పిపిఎం కంటే అత్యధికంగా ఉన్నదంటూ నివేదికలున్నాయని చెప్పారు. ఫ్లోరైడ్ నీళ్లు తగడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రాష్ట్రాలలోని రెండు జిల్లాల్లో ఆరవై లక్షల మంది పిల్లలతోపాటు మొత్తం తొమ్మిది కోట్ల మంది ప్రజలు ఈ సమస్యతో సతమతమవుతున్నారని సభలో తెలిపారు. కేంద్ర భూగర్భ జలాల బోర్డు నివేదిక ప్రకారం అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లోని 20 జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు స్పష్టమైందని కేశినేని చెప్పారు. ప్రజలకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాపులను బిసి జాబితాలో చేర్చాలి
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్‌లోని కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని కోరుతూ జాతీయ బిసి సంక్షేమ సంఘం సభ్యులు గురువారం ఏఐసిసి కార్యాయం ఎదుట ప్రదర్శన చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో కాపులు వెనుకబడి ఉన్నారని సంఘం అధ్యక్షుడు అంగిరేకుల ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చే విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీలు తమ వైఖరిని తెలియచేయాలన్నారు.